ఈ మూవీ అనంతరం వరుస అవకాశాలను అందుకుని క్రేజీ హీరోయిన్‌గా మారిన రెజీనా.. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. అయితే కొన్నాళ్లకు ఏమైందో ఏమోగానీ రెజీనా కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. ఇందుకు కారణం మెగా హీరోతో రెజీనా లవ్ ఎఫైర్ పెట్టుకోవడమే అన్న టాక్ ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, రెజీనాలు పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సెల్, నక్షత్రం చిత్రాల్లో జంటగా నటించారు. వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండటంతో సాయి ధరమ్ తేజ్, రెజీనాలు లవ్‌లో ఉన్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. రెజీనా మెగా కోడలు కావాలనుకుంటోందని, త్వరలోనే ఆమె తేజ్‌ను పెళ్లి చేసుకోబోతోందని కూడా ప్రచారం జరిగింది. కానీ, ఈ వార్తలను వారిద్దరూ ఖండించారు. అయితే కొన్నాళ్లకు రెజీనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన కామెంట్ చేసింది. ఓ హీరో వలన తన కెరీర్ నాశనమైందంటూ రెజీనా వ్యాఖ్యానించింది. దీంతో ఆమె తేజ్ గురించి చెప్పిందని.. అతడు బ్రేకప్ చెప్పడంతో రెజీనా కలలన్నీ చెడిపోయాయని గుసగుసలు వినిపించాయి. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో వారిద్దరికే తెలియాలి. కాగా, రెజీనా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె నివేదా థామస్ తో కలిసి `శాకిని డాకిని` అనే సినిమా చేస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అలాగే `నేనా నా..?`, ప్రభు దేవాతో `ఫ్లాష్ బ్యాక్` చిత్రాలూ చేస్తోంది. వీటితో పాటు `ఆచార్య`లో చిరంజీవితో కలిసి ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ కూడా చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి