ఒక సాదాసీదా డాన్స్ షో గా ప్రారంభమైన ఢీ కార్యక్రమం ప్రస్తుతం సౌతిండియాలోని బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో గా మారిపోయింది. కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే కాదు దేశం నలుమూలల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతోమంది డ్యాన్స్ మాస్టర్లు ఆసక్తి చూపుతుంటారు అనే చెప్పాలి. అయితే ఒకప్పుడు ఢీ కార్యక్రమం అనగానే కేవలం డాన్స్ మాత్రమే గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఢీ షో పేరెత్తగానే కడుపుబ్బ నవ్వించే ఎంటర్టైన్మెంట్ కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఈ కార్యక్రమంలో ఎంతో మంది కమెడియన్స్ తమదైన శైలిలో అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉండటం గమనార్హం.



 అయితే ఇప్పటి వరకు తెలుగు బుల్లితెర పై ఎంతో సక్సెస్ఫుల్గా 13 సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ కార్యక్రమం ఇక ఇటీవల ఢీ 14 వ సీజన్ డ్యాన్సింగ్ ఐకాన్ పేరుతో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి వారం  కూడా అటు బుల్లితెర ప్రేక్షకులందరికీ అదిరిపోయే పర్ఫామెన్స్ లతో ఆశ్చర్యపరుస్తూ ఆకట్టుకునే కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది ఈ కార్యక్రమం. ఇకపోతే జనవరి 12 వ తేదీన ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని ఇటీవలే విడుదల చేశారు. ప్రోమోలో భాగంగా సాయి-  నైనిక జోడి గీత గోవిందం సినిమాలోని ఒక పాట పై డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి ఆకట్టుకుంటుంది.


 అంతేకాదండోయ్ ఈ జోడీ మధ్య మాటల సంభాషణ కూడా ఎంతో సరదాగా ఆకర్షణీయంగా సాగిపోయింది అని చెప్పాలి. కొన్ని పరిచయాలు మన జీవితంలో చాలా మార్పులు తీసుకు వస్తాయి. అది బాధ నుంచి ఆనందానికైనా ఆనందం నుంచి బాధ కైనా అలాగే నా జీవితంలో అనుకోని అతిథిలా వచ్చి నా ప్రాణమైన అమ్మాయి నువ్వు అంటూ నైనిక కు సాయి ప్రపోజ్ చేసాడు. దీంతో ఇక ఈ ప్రపోజల్ చూసి అందరూ మురిసిపోతారు.. అయితే ఎన్నో రోజుల నుంచి నైనిక - సాయి లవ్ లో కొనసాగుతున్నారు అన్న విషయంతెలిసిందే. వీరిద్దరు స్టేజ్ మీద కనిపించారు అంటే బుల్లితెర ప్రేక్షకులను మురిసిపోతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: