టాలీవుడ్ నిర్మాత శిరీష్ త‌న‌యుడు ఆశీష్ హీరోగా పరిచ‌యం అవుతూ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. ఇందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.  ఈ సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల అవుతుంది.ఇటీవ‌లే ట్రైల‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ విడుద‌ల చేసి  ఈ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు ఎన్టీఆర్‌. అదేవిధంగా ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల రోజే తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ భోగి, సంక్రాంతి, క‌నుమ పండుగ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. రౌడీబాయ్స్ సినిమా ఘ‌న విజ‌యం సాధించాల‌ని కోవిడ్ స‌మ‌యంలో విడుద‌ల‌వుతున్న రౌడీబాయ్స్ ఒక మంచి చిత్రంగా  మ‌న‌కు గుర్తుండిపోవాల‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపారు.

తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్టు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా  ఆశిష్ ప‌రిచ‌యం అవుతున్నారు.   ప్రేమ దేశం చూసిన ఎగ్జ‌యిట్‌మెంట్ వ‌చ్చింది. నాకే కాదు. మీ అంద‌రికీ కూడా అలాంటి ఎగ్జ‌యిట్‌మెంట్ క‌లుగుతుంద‌ని మ‌న‌సారా న‌మ్ముతున్నాను అని చెప్పారు ఎన్టీఆర్‌. మ‌రొక‌వైపు ఈ సినిమాను నిర్మాత దిల్‌రాజు భారీగానే విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమా విడుద‌ల‌తో అక్కినేని నాగార్జున, నాగ‌చైత‌న్య‌లు క‌లిసి న‌టిస్తున్న బంగార్రాజు చిత్రానికి థియేట‌ర్ల కొద‌వ ఏర్ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మ‌రొక‌వైపు తాజాగా ఈ చిత్రంలోని డేట్ నైట్ అంటూ కొన‌సాగే పాట‌ను ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ విడుద‌ల చేసారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవీశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందించ‌గా.. ఇప్ప‌టికే  ఈ చిత్రంలోని విడుద‌ల చేసిన పాట‌లు, ట్రైల‌ర్ మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమా ట్రైల‌ర్ ను బ‌ట్టి చూస్తే.. క‌ళాశాలలో  నేప‌థ్యంలో సాగే  ల‌వ్ ఎంట‌ర్ టైన్ చిత్రంగా క‌నిపిస్తోంది. అదేవిధంగా అక్క‌డ‌క్క‌డ  రొమాన్స్  సీన్స్ కూడా ఉన్నాయి. యాక్ష‌న్ సీన్లు కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.  ట్రైల‌ర్ చూస్తుంటే  సినిమాను  ల‌వ్ అండ్ యాక్ష‌న్ నేప‌థ్యంలో కొన‌సాగుతుంది. ఇప్ప‌టికే ట్రైల‌ర్ చూసిన‌ ప‌లువురు నెటిజ‌న్లు అదుర్స్ అని కామెంట్లు కూడా చేస్తున్నారు.  జ‌న‌వ‌రి 14న విడుద‌ల‌య్యే ఈ సినిమా ఏవిధంగా ఉండ‌నుందో చూడాలి మ‌రీ.

మరింత సమాచారం తెలుసుకోండి: