సినిమా పరిశ్రమలో కొన్ని కొన్ని కాంబినేషన్ లు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటాయి. హీరో హీరోయిన్ లు,  నిర్మాత హీరోలు, దర్శకులు హీరోలు, హీరోయిన్ లు దర్శకులు ఇలా వెరైటీ వెరైటీ కాంబినేషన్లు ప్రేక్షకులను అలరించగా వారు మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలి అనిపించే విధంగా ఈ జోడీలు సినిమాలు చేస్తూ ఉంటూ ఉంటాయి. అయితే మధ్యలో కొత్తదనం కోసం వీరు కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే ప్రేక్షకులు ఎంతగానో నిరాశ పడి పోతూ ఉంటారు. ఆ విధంగా టాలీవుడ్ లో బెస్ట్ పెయిర్ గా గా ప్రేక్షకులను అలరిస్తున్నారు కొరటాల శివ మరియు దేవి శ్రీ ప్రసాద్. 

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న మొదటి సినిమా నుంచి దేవిశ్రీప్రసాద్ మాత్రమే ఆయనకు సంగీతం అందిస్తూ వచ్చారు. అద్భుతమైన పాటలను అందించడం మాత్రమే కాకుండా అమోఘమైన నేపథ్య సంగీతాన్ని కూడా అందించి కొరటాల శివ సినిమాను స్పెషల్ గా చేస్తూ ఉంటారు దేవిశ్రీప్రసాద్. ఆ విధంగా వీరి కాంబినేషన్లో మ్యూజికల్ హిట్స్ సినిమాలు  ప్రేక్షకుల ముందుకు వచ్చి వారి జోడి కి మంచి క్రేజ్ తెచ్చి పెట్టాయి. అయితే కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ ను కాదని చిరంజీవి మాట ప్రకారం మణిశర్మ ను సంగీత దర్శకుడిగా పెట్టుకొని ఆ సినిమాను పూర్తి చేశాడు కొరటాల.

అయితే మణిశర్మ ను తీసుకోవడం వల్ల కొరటాలశివ మనసు పూర్తిగా మారిపోయిందో ఏమో ఇప్పుడు ఆయన తెరకెక్కించబోయే తదుపరి సినిమాకి కూడా వేరొక సంగీత దర్శకుడునే పెట్టుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడట ఈ దర్శకుడు. ఎన్టీఆర్ 30 వ సినిమాను చేస్తున్న కొరటాల శివ ఈ సినిమాకి సంగీత దర్శకుడు గా కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్ ను ఎంపిక చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.  ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్  ను కొంతమంది దర్శకులు విడిచిపెట్టి ఇతర సంగీత దర్శకులతో సినిమాలు చేస్తూ ఉండగా ఇప్పుడు కొరటాల శివ కూడా దేవిశ్రీ ప్రసాద్ ను వదిలి వెళ్లిపోవడం పట్ల వారి అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: