టాలీవుడ్ లో నెంబర్ వన్ దర్శకుడు ఎవరయ్యా అంతే తడుముకోకుండా చెప్పే పేరు ఎస్ ఎస్ రాజమౌళి. ఈయన అదృష్టమో, ప్రతిభో, ఆత్మవిశ్వాసమో, లేక అన్ని కలగలిపి కలిసి వస్తున్నాయో చెప్పలేము కానీ ఈయన పట్టిందల్లా బంగారమే. ఏ సినిమా తీసినా అదొక సంచలన విజయంగా మారుతోంది. దర్శకుడిగా జక్కన్న తొలి చిత్రం స్టూడెంట్ నంబర్ వన్ దగ్గర నుండి ఇప్పటి వరకు ఆయన కెరియర్ లో మొత్తం 12 సినిమాలు చేయగా ప్రతిదీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. కథ, హీరో, హీరోయిన్ పాత్రధారులు ఇవన్నీ పక్కన పెడితే, ఈ మహా దర్శకుడు సినిమాకి స్కెచ్ వేశారు అంటే ఇక దానికి తిరుగే లేదు.

కాగా రాజమౌళి కూడా కాంబినేషన్ పరముగా వచ్చే విజయాలను నమ్ముతుంటారు. అందుకే ఒకసారి చేసిన హీరో, హీరోయిన్ తో సినిమాలు చేస్తాడు. అదే విధంగా హీరోయిన్ - దర్శకుల హిట్ కాంబినేషన్ విషయానికి వస్తే... ఈ డైరెక్టర్ హీరోయిన్ అనుష్కతో కలిసి మూడు చిత్రాలను చిత్రీకరించారు. అలా వీరిద్దరి కాంబోలో విక్రమార్కుడు, బాహుబలి 1 , బాహుబలి 2 ముచ్చటగా మూడు  సినిమాలు తెరకెక్కాయి. ఈ మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నవే. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే డైరెక్టర్ రాజమౌళి ఇప్పటి వరకు మరో హీరోయిన్ తో కాంబినేషన్ ను రిపీట్ చేసింది లేదు.

అయితే కథను బట్టి ఆ పాత్ర కోసం అనుష్కను ఎంపిక చేశారు జక్కన్న. అలా వీరి కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చి సంచలన విజయాలను అందుకుని వసూళ్ల వర్షం కురిపించాయి. హీరోలను కూడా రిపీట్ చేస్తూ సినిమాలు తీస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇప్పటికే ఎన్టీఆర్ తో యమదొంగ, స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలు చేశారు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ తో ముచ్చటగా మూడవ సినిమాకు శ్రీకారం చుట్టారు. అంతే కాకుండా మెగా హీరో రామ్ చరణ్ తేజ్ తో మగధీర సినిమాతో సంచలన విజయాన్ని అందించి ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ తో మన ముందుకు రానున్నాడు.  
మరింత సమాచారం తెలుసుకోండి: