థింక్ డిఫరెంట్ అంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సరికొత్త ఆలోచనా ధోరణితో ముందుకు వెళితే కొత్త జనరేషన్ లతో ఈజీగా కనెక్ట్ కావచ్చు. అదే రూట్ లో సక్సెస్ దానంతటదే వచ్చి పలకరిస్తుంది. ఆ విధంగా ఇద్దరి మైండ్ సెట్ సింక్ అవ్వడం వల్లే తెలుగులో మరో క్రేజీ అండ్ కలర్ ఫుల్ కాంబినేషన్ కుదరబోతోంది. ఆడియన్స్ కి న్యూ ఏజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దొరకబోతోంది. ఇంతకీ ఏంటా కాంబినేషన్? ఏంటా కథ అనుకుంటున్నారా..? ఒకప్పుడు థింక్ బిగ్ అంటూ నార్త్ ఇండస్ట్రీ చూపును కూడా తనవైపుకు తిప్పుకునేలా స్ట్రాటజీలు అల్లేవారు అల్లు అరవింద్.కానీ ఒక ప్రొడ్యూసర్ గా భారీతనమే కాదు నావెల్టీ ని కూడా కన్సిడర్ చేయాలన్న తలంపు కనిపిస్తుందిప్పుడు.

అలా రూపుదిద్దుకున్న అద్భుతం పేరే అన్ స్టాపబుల్. బాలయ్యతో టాక్ షో చేయాలన్న ఆలోచనే అరవింద్ థాట్స్ లో ఎంత యూత్ ఫుల్ నెస్ ఉందో తేల్చేసింది. కానీ అల్లువారి దూకుడు ఇక్కడితోనే ఆగట్లేదు. అఖండ తో పరిశ్రమలో బిగ్ హోప్ నింపిన బాలయ్య,అన్ స్టాపబుల్ తో ఆడియన్స్ లో మన ఉల్లాసాన్ని అదే స్థాయిలో పంచిపెట్టారు.ఇలా బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ రెండు చేతుల పాపులారిటీ పెంచుకున్నారు. ఆహాలో తమ కాంబినేషన్ ఓహో రేంజ్ లో కుదిరింది కనుక బిగ్ స్క్రీన్ పై ఈ స్నేహాన్ని కంటిన్యూ చేయబోతోంది అల్లు కంపౌండ్. బాలయ్య హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఒక భారీ సినిమా వస్తోంది అని మొన్నటి దాకా వినిపించడం మాట ఇప్పుడు వాస్తవంలోకి రాబోతోంది.  ప్రస్తుతం క్రాక్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు బాలయ్య.

ఇంత వరకు తనతో చేయ్యని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లని కలుపుకొని వెళ్లాలన్న ఐడియాలజీని ఎంకరేజ్ చేస్తున్న అని సాలిడ్ హింట్ ఇండస్ట్రీ లో ఇచ్చేసారు. కొత్త ప్రాజెక్టుల రూపకల్పనలో బిజీగా ఉన్న అల్లు అరవింద్ బాలయ్యతో మూవీ కోసం కథ రెడీ చేయిస్తున్నారట. ఈపాటికే ఇద్దరు బ్రాండ్ న్యూ డైరెక్టర్ లను లైన్ లో పెట్టేసారని, ఈ నయా కాంబినేషన్ కి సంబంధించి త్వరలో బ్రేకింగ్ న్యూస్ రాబోతోందని టాక్. ఈ సర్ప్రైస్ కోసమే ఈగర్ గా వెయిట్ చేస్తోంది బాలయ్య కాంపౌండ్.

మరింత సమాచారం తెలుసుకోండి: