టాలీవుడ్ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై మొదటిసారి గళం విప్పింది శ్రీరెడ్డి.. ఆమె ఆ సమయంలో అర్ధనగ్నంగా హైదరాబాద్ ఫిలిమ్ ఛాంబర్ చుట్టూ తిరిగింది.. దాంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ గా మారిపోయింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ లో ఉండే ఎన్నో అంశాలపై స్పందించడం జరిగింది. ఇక అంతే కాకుండా కొంతమంది హీరోల పై కూడా కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉండేది. అయితే తాజాగా చిరంజీవి తల్లికి అంజనీదేవిని క్షమించమని వేడుకుంటోంది.. అలా ఎందుకు చేస్తుందో ఇప్పుడు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.

కొన్ని రోజుల క్రితం ఒక వివాదంలో ఏమాత్రం సంబంధం లేని చిరంజీవి అమ్మగారిని తిట్టడంతో శ్రీరెడ్డి ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొంది.. అయితే ఆ విషయంపై తాజాగా శ్రీ రెడ్డి చిరంజీవి తల్లిని క్షమాపణలు కోరుకుంటుంది.. బుద్ధి తక్కువై ఇలాంటి పని చేశాను.. మీరు దయచేసి నన్ను క్షమించండి అంటూ ఒక వీడియో  ద్వారా వేడుకుంటోంది శ్రీరెడ్డి.. ఇక శ్రీరెడ్డి ఆ వీడియోలో మాట్లాడుతూ.."ఆడవాళ్ళ కోసం నేను చేపట్టిన ఏ ఉద్యమమైనా అది న్యాయం కోసమే.. కానీ ఒక పెద్దమనిషి నాకు ఇచ్చిన సలహాతో.. చిరంజీవి తల్లి అంజనమ్మని అనరాని మాటలు అనవలసి వచ్చిందని తెలిపింది.. ఈ విషయంపై తనకి ఏ విధంగా సంబంధం లేదని.. అలా చేయడం నా తప్పే.. దానికి నేను ఇప్పుడు శిక్ష కూడా అనుభవిస్తున్నాను అంటూ తెలియజేస్తోంది.

అందుచేతనే హైదరాబాదులో ఉండే పెద్దమ్మ గుడి ముందర క్షమించమని కోరుకుంటోంది.. ఒక వ్యక్తి చెప్పుడు మాటలు విని చిరంజీవి తల్లిని అనవలసి వచ్చింది.. అయితే చిరంజీవికి ఆ వ్యక్తికి ఎలాంటి గొడవలు ఉన్నాయో.. తనకు తెలియదని.. కానీ ఇలా చేస్తే తమ కుటుంబం అంతా ఆమె దగ్గరకు వస్తుందని తెలియజేయడంతో ఇలా చేశానని చెప్పుకొచ్చింది.. ఏది ఏమైనా శ్రీరెడ్డి నిజాయితీగా తన తప్పును తెలుసుకొని అని అడగడం తో ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: