
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు పర బాషా హీరోయిన్స్ ఎందరో వచ్చారు , పోయారు . కానీ మాలీవుడ్ భామలు మాత్రం ఇక్కడ మాత్రం బాగా క్లిక్ అయ్యారు. కొందరైతే ఇక్కడ స్టార్ హీరోయిన్స్ కూడా అయ్యారు. అలాంటి జాబితా లో నాటి శోభన నుండి నేటి నయనతార వరకు చాలా మంది ఉన్నారు. కానీ తెలుగు లో ఒక్క సినిమా చేయకుండానే ఇక్కడ మంచి క్రేజ్ సంపాదించిన హీరోయిన్ గురించి తెలుసుకోవాలని ఉందా , అయితే కింద చదవండి.
నజ్రియా నజిమ్ .... ఈ పేరు సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్స్ లో ఒకరు.బాలనటిగా సినిమాల్లో కి ప్రవేశించి అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా అందుకున్నారు. నటించిన చిత్రాల సంఖ్య తక్కువే అయినా ప్రతి చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆమె ఆర్య తో కలిసి నటించిన రాజా రాణి చిత్రం అయితే దక్షిణాది బాషాలన్నింటిలో ఘన విజయాన్ని సొంతం చేసుకొని ఆమెకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల లో అయితే ఆమెకు మంచి క్రేజ్ సంపాదించి పెట్టింది. 


నజ్రియా కు తెలుగు లో ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చాలా మంది నిర్మాతలు, దర్శకులు తమ చిత్రాల్లో నటించ మని పలు ఆఫర్లు ఇచ్చినా కానీ ఈ భామ అప్పుడు పట్టించుకోలేదు కానీ కోలీవుడ్, తన మాతృ ఇండస్ట్రీ మాలీవుడ్ లో వరుస చిత్రాలతో బిజీగా ఉండిపోయింది, ఆ తర్వాత నటుడు మాలీవుడ్ యువ సూపర్ స్టార్ ఫాహాద్ ఫజిల్ తో ప్రేమ చిగురించి వివాహాం చేసుకొంది. 

ఫాహాద్ తో వివాహాం తర్వాత కొంత కాలం సినిమాలకు విరామం ఇచ్చినా ఈ మాలీవుడ్ భామ , మళ్ళీ ఆఫర్లు రావడం తో ప్రస్తుతం కోలీవుడ్, మాలీవుడ్ లలో నటిస్తున్నారు. ఈ సమయంలో నే తెలుగు లో సైతం మంచి ఆఫర్లు రావడం ప్రారంభమైన చాలా సెలెక్టివ్ గా చిత్రాలను ఎంపిక చేసుకుంటుంది. అయితే ఒక ఇంటర్వ్యూ లో మాత్రం తెలుగు లో ఇన్నాళ్లు చేయకపోవడానికి కారణం మాత్రం మంచి కథ దొరకలేదు అని చెబుతూనే దేశవ్యాప్తంగా తెలుగు చిత్రాలకు ప్రస్తుతం వస్తున్న గుర్తింపు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పింది. నాని సరసన అంటే సుందరానికి చిత్రంలో నటిస్తున్నాను అని చెప్పింది.