కోలీవుడ్ అగ్ర హీరో ఇళయదళపతి విజయ్ కి తెలుగులో కూడా భారీ క్రేజ్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. విజయ్ నటించిన తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయి భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఇటీవలే  "మాస్టర్" సినిమాతో మంచి హిట్ అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ .తాజాగా ఇప్పుడు "బీస్ట్" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈయన.మొన్న "డాక్టర్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

అంతేకాదు వీరితో పాటుగా  సెల్వరాఘవన్, యోగిబాబు, జాన్ విజయ్, అపర్ణ దాస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ఒక స్టార్ హీరో తనయుడు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఆ స్టార్ హీరో మరెవరో కాదు విజయ్ సేతుపతి. ఇక ఈయన సూపర్ హిట్ సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న విజయ్  తనయుడు సూర్య ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ పాత్ర చాలా స్పెషల్ గా ఉండబోతోందని ఈ పాత్రలో సూర్య అయితే బాగుంటుందని దర్శకనిర్మాతలు..

 విజయ్ సేతుపతి ని ఒప్పించి సూర్యని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కళానిధి మారన్ సన్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇక అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి తాజాగా మొదటి పాట 'అరబిక్ కుతూ' విడుదలై సూపర్బ్ రెస్పాన్స్ కనబరిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. ఇక యూట్యూబ్లో ఈ పాట ఇప్పటికే 80 మిలియన్ల వ్యూస్ అందుకొని సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇక ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 22న విడుదల కాబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: