తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదుగుతూ రోజురోజుకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న వారిలో హీరో ధనుష్ కూడా ఒకరు. ఇక ఈ హీరో సినిమాలంటే తమిళ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పవచ్చు.. వరుస సినిమాలు చేస్తూ హిట్ కొడుతూ చాలా బిజీగా ఉన్నారు.తెలుగులో కూడా ఎన్నో సినిమాలు డబ్ చేసి విడుదల అవుతూ ఉన్నాయి. అయితే ధనుష్ ఈసారి డైరెక్టు గా తెలుగులోనే సినిమా చేయడానికి సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.


డైరెక్ట్ తెలుగు సినిమాల్లో నటిస్తే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యే ఆవకాశం ఉంటుందని హీరో ధనుష్ సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు హీరో ధనుష్ ఎక్కువగా డబ్బింగ్ సినిమాలనే తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇక ప్రస్తుతం డైరెక్ట్ గా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఒక సినిమాని తెలుగులో చేయబోతున్నట్లు గా ప్రకటించడం జరిగింది. ఈ చిత్రాన్ని తొలిప్రేమ సినిమా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా సూర్యదేవర నాగ వంశీ వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకి టైటిల్ గా సార్ అని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.. అయితే ఈ చిత్రం కంటే ముందుగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక సినిమాని ఒప్పుకున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.


అన్నిటికంటే ముందుగా వెంకీ అట్లూరి సినిమాని షూటింగ్ మొదలు పెట్టాలని చిత్ర బృందం భావించినట్లుగా తెలుస్తోంది. ఒకవైపు ఈ రెండు సినిమాల షూటింగ్ చేస్తూనే మరొక తెలుగు మూవీ కమిటీ అయినట్లుగా మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు బ్యానర్ పై ఒక సినిమాలో చేయబోతున్నట్లు వార్త వినిపిస్తున్నది. ఈ సినిమాకి డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ గా వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: