రికార్డులు బద్దలు కొడుతున్న జక్కన్న సృష్టించిన మరో అద్భుతం rrr చిత్రం. ఈ సినిమా కలెక్షన్స్ పరంగానూ, ప్రశంసల పరంగాను ఎదురే లేకుండా శరవేగంగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రతి పాత్రకూ ప్రాణం పోశారు దర్శకుడు రాజమౌళి. ఆ పాత్రను పండించడం లో సఫలం అయ్యారు పాత్రధారులు. ఈ క్రమంలో హీరో, హీరోయిన్లకు మాత్రమే కాదు ఈ చిత్రం లో నటించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. వారి నటనతో ప్రేక్షకులను తమ వైపుకు తిప్పుకున్నారు నటీనటులు. ముఖ్యంగా ఈ చిత్రానికి ఆయువు పట్టు అయిన చెర్రీ, తారక్ ల నటనకు జనం నీరాజనాలు పలుకుతున్నారు.

అదే విధంగా బాలీవుడ్ నటి ఆలియా బట్ మరియు హాలీవుడ్ యాక్టర్ ఒలివియ మోరిస్ జెన్నిఫర్ లకు కూడా మంచి పేరు వచ్చింది. జెన్నీ నటనకు, ఆమె అందానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే తాజాగా తన ప్రియుడితో కలిసి ఈ సినిమాను వీక్షించిన జెన్నీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. తారక్ లాంటి గొప్ప నటుడి పక్కన చేయడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. థియేటర్ లో కొమరం భీముడో పాట చూసి  కన్నీళ్లు ఆగలేదు... అంతగా తారక్ నటన నన్ను లీనం అయ్యేలా చేసింది. ఆ సినిమాలో నటించిన నాకే అది చిత్రీకరణ అన్న విషయాన్ని గుర్తు రాకుండా కన్నీళ్లతో  స్పందించేలా చేశారు అంటే తారక్ నటన ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తారక్ ఒక అద్భుతమైన , ప్రత్యేకమైన వ్యక్తి. సింగిల్ టేక్ కళాకారుడు. ఈ సినిమాలో నాకు "నాటు నాటు..." పాట అంటే చాలా ఇష్టం. ఆ సాంగ్ ను చాలా బాగా ఎంజాయ్ చేశాను. షూటింగ్ సమయం లో కూడా ఆ సాంగ్ అలా చాలా హ్యాపీగా సాగిపోయింది. ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నా బాయ్ ఫ్రెండ్ ఈ పాటకు నా కోసం డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ఈ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు జెన్నిఫర్. కాగా ఈ సినిమా ౧౦౦౦ కోట్ల కలెక్షన్ కు దగ్గరలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: