త్రివిక్రమ్ సినిమాలలో మాటలు తూటాలు లా పేల్తాయి. అందువల్లనే నిర్మాతలు ఆయన స్క్రిప్ట్ వ్రాసి ఇస్తే చాలు కోట్లాది రూపాయలు పారితోషికంగా ఇస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ‘కేజీ ఎఫ్ 2’ మ్యానియా కనిపిస్తోంది. మన తెలుగు మీడియా కూడ కన్నడ సినిమా అన్న దృష్టితో చూడకుండా ‘కేజీ ఎఫ్ 2’ పై ప్రశంసలు కురిపిస్తోంది.
సాధారణంగా డబ్బింగ్ సినిమాలలో డైలాగులు ప్రేక్షకుడు బయటకు వచ్చిన తరువాత అవి గుర్తు ఉండేలా ఉండవు. అయితే ఈ మూవీ తీరు దీనికి భిన్నంగా ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమూవీలోని డైలాగ్స్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ‘ఇక్కడ తలలు శాశ్వతం కాదు. కిరీటాలు మాత్రమే శాశ్వతం నెపోటిజం నెపోటిజం నెపోటిజం మెరిట్ ను ఎదగనివ్వరా’ ‘ఇంటిని ఆక్రమిస్తే నా సమస్య కాదు వీధిని ఆక్రమిస్తే నా సమస్య కాదు’ ఊరిని ఆక్రమిస్తే నాసమస్య కాదు అనుకోవడం వల్లే బ్రిటిష్ వాళ్లు దేశాన్ని ఆక్రమించారు’.
ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ ఒక డబ్బింగ్ సినిమాలో విన్న సగటు ప్రేక్షకుడు కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పేరు గాంచిన డైలాగ్ రైటర్స్ ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ ఎందుకు వ్రాయలేకపోతున్నారు అంటూ కొందరు సగటు ప్రేక్షకులు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఫిలిం బడ్జెట్ తో పోల్చుకుంటే ‘కేజీ ఎఫ్ 2’ సినిమా బడ్జెట్ అందులో సగం కూడ ఉండదు. అయితే ఈమూవీ టోటల్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈమూవీ బయ్యర్లు ‘ఆర్ ఆర్ ఆర్’ బయ్యర్ల కంటే ఎక్కువ లాభాలు మూట కట్టుకుంటారు అన్న ప్రచారం జరుగుతోంది.
‘బాహుబలి’ వన్ కంటే ‘బాహుబలి 2’ ఘన విజయం సాధించినట్లుగా ‘కేజీ ఎఫ్’ కంటే ‘కేజీ ఎఫ్ 2’ సాధించిన ఘన విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కేజీ ఎఫ్ 3’ తీయడం ఖాయం అంటున్నాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి