మరాఠీ చిత్రం అయిన సైరత్ పంజాబీ రీమేక్‌తో సినీ ఇండ్రీస్టీలోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. తెలుగులో ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూ వుంది.

ఆ తర్వాత 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'వెంకీ మామ', 'డిస్కోరాజా' సినిమాలో అలా మెరిసింది. సినిమాలతో పలకరించినా కానీ పెద్దగా ఒరిగిందేమి లేదు. అయితే, కళ్లు చెదిరే అందంతోపాటు అందాలు ఆరబోయడానికి ఏమాత్రం వెనుకాడకుండా ఇప్పటికీ అవకాశాలను పట్టేస్తుందట.ఆర్‌ఎక్స్‌100తోనే యూత్‌ మనసు కొల్లగొట్టిన పాయల్.. ఆ మూవీలో కార్తికేయతో కలిసి ఎన్నో బోల్డ్‌ సీన్లలో హాట్ గా కనిపించింది. ఆ తర్వాత ఏ సినిమాలో అయినా ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా అందాల వడ్డనకు అసలు అడ్డే చెప్పదని పేరు మాత్రం తెచ్చుకుంది. ప్రస్తుతం ఆది సాయికుమార్ సినిమాతో పాటు తెలుగులో మరో సినిమాలో కూడా నటిస్తున్న పాయల్.. ఆ సినిమాలో కూడా ఓ రేంజ్ స్కిన్ షోతో రెచ్చిపోయిందట.. ఇప్పటికే ఈ సినిమాల నుండి వచ్చిన పోస్టర్లు కూడా తెగ వైరల్ అయ్యాయి. కాగా.. ఇప్పుడు పాయల్ స్టేజ్ మీదనే బాయ్ ఫ్రెండ్ కి లిప్ లాక్ ఇచ్చి అందరికీ కూడా షాక్ ఇచ్చింది.రెండేళ్ల కిందట వాలెంటైన్స్‌ డే సందర్భంగా పాయల్ తన బాయ్‌ఫ్రెండ్‌ సౌరభ్ దింగ్రను అందరికి పరిచయం చేసింది.అతనితో ఎన్నో ఏళ్లుగా ఆమె డేటింగ్‌లో కూడా ఉంది. ముంబైలో టీవీ నటిగా ఉన్నప్పటి నుంచే వీళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నారట. వాళ్ళ కుటుంబాలు కూడా వీళ్ల రిలేషన్‌షిప్‌ను ఇప్పటికే అంగీకరించాయి కూడా. దీంతో ఈ జంట పబ్లిగ్గానే రెచ్చిపోతోందట. ఈమధ్య జరిగిన ఓ స్టేజ్‌ షోలో వీరు ఇద్దరూ కలిసి పర్ఫామ్‌ చేశారు. ఈ పర్ఫార్మెన్స్‌ ముగిసిన తర్వాత పాయల్.. తన ప్రియుడికి స్టేజ్‌పైనే పెదాలపై ముద్దు పెట్టడంతో అక్కడున్న వాళ్లంతా కూడా షాక్‌ తిన్నారు. అన్నట్లు ఈ ఎపిసోడ్ ఈరోజు (మే 22) సాయంత్రం ప్రసారం కానుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: