ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ సినిమా కథలు అనేక రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. “బాహుబలి 2” మొదలుకుని తెలుగు సినిమా కథలు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అనేక రికార్డులు సృష్టించాయి.


బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజకీయాల్లో ఉన్న చాలామంది స్టార్ హీరోలు ఈమధ్య తెలుగు కథలు హిందీ లో రీమేక్ చేసి హిట్ అందుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఏకంగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాలు అనేక రికార్డులు సృష్టిస్తూ ఉండటంతో…. బాలీవుడ్ స్టార్ హీరోల భవిష్యత్ ప్రశ్నార్థకంలో మారిపోయిందని తెలుస్తుంది.


ఇటీవల rrr మరియు kgf సినిమాలు ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ లు సాధించడం కూడా సంచలనంగా మారినట్లు తెలుస్తుంది.. ఈ పరిణామంతో బాలీవుడ్ లో చాలామంది స్టార్ ప్రొడ్యూసర్ లు హాలీవుడ్ ప్రాజెక్టులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటికే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” కి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్.. మరికొన్ని టాలీవుడ్ ప్రాజెక్టులు కూడా చేస్తున్నారు. చాలా వరకు బాలీవుడ్ లో టాలీవుడ్ సినిమాలను కరణ్ జోహార్ ప్రమోట్ చేస్తూ ఉన్నారట..


ఈ క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా హైలెట్ అయినా తన షో అయిన కాఫీ విత్ కరణ్ జోహార్.. ఇటీవల ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ రీ స్టార్ట్ చేస్తూ… టాలీవుడ్ స్టార్ నటీనటులకు పెద్ద పీట వేస్తూ షో ప్రారంభించాలని కరణ్ డిసైడ్ అయ్యారని తెలుస్తుంది.దీనిలో భాగంగా త్వరలో సమంత, బన్నీ, రష్మిక మందన, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్, పూజా హెగ్డే లతో షో ప్రారంభించనున్నట్లు సమాచారం. ఏకంగా మొత్తం టాలీవుడ్ స్టార్ నటీనటులతో కరణ్ జోహార్ తన షో తిరిగి ప్రారంభించడానికి రెడీ అవటం బాలీవుడ్ మీడియాలో సంచలనం గా మారినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: