విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఎఫ్ 3 . ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుండట పూజా హెగ్డేమూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా,  ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఎఫ్ 3 మూవీ ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కింది. ఎఫ్ 2 మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో సినీ ప్రేమికులు ఎఫ్ 3 సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఎఫ్ 3 మూవీ రేపు అనగా మే 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.  ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ కి చిత్ర బృందం థియేటర్ లను కూడా భారీ సంఖ్యలో కేటాయించింది.  అందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్ 3 మూవీ ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతోంది తెలుసుకుందాం.

నైజాం లో 270 .
సీడెడ్ లో 170 ప్లస్ .
ఆంధ్ర లో340 ప్లస్ .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఎఫ్ 3 మూవీ 780 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతుంది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎఫ్ 3 మూవీ దాదాపు 110 థియేటర్ లలో విడుదల కాబోతుంది.
ఓవర్ సీస్ లో ఎఫ్ 3 మూవీ 480 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతుంది.


మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్ 3 మూవీ 1370 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతుంది.
మరి ఎఫ్ 3 మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: