బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమీర్ ఖాన్ తెలుగులో నేరుగా ఒక్క సినిమాలో కూడా నటించకపోయినప్పటికీ హిందీ లో నటించిన సినిమాల ద్వారానే అమీర్ ఖాన్ తెలుగులో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్ద సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

 ఈ సినిమాలో అమీర్ ఖాన్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో  టాలీవుడ్ హీరో నాగ చైతన్య కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. నాగ చైతన్యమూవీ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మూవీ అమీర్‌ ఖాన్ ప్రొడక్షన్స్‌లో బ్యానర్‌లో రానుంది. ఈ మూవీ 1994 లో హాలీవుడ్ స్టార్ టామ్ హాంక్స్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ఫారెస్ట్ గంప్ మూవీ కి  రీమేక్. ఈ మూవీ కి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పలుమార్లు విడుదల తేదీ ని వాయిదా వేసుకుంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో తాజాగా చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

సినిమా ట్రైలర్ ను రేపు అనగా మే 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్ లు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి  మరి ఈ సినిమా ట్రైలర్ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: