అయితే రమ్య కృష్ణ ఒక రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అవును ఆమె ఒక రోజుకి 10 లక్ష ల వరకు ఛార్జ్ చేస్తారట, పాత్రను బట్టి కొన్ని సార్లు ఇంతకు మించే తీసుకుంటారట. అంటే ఓ సినిమా కోసం 10,15 రోజులు చేస్తే చాలు పారితోషకం కోట్లల్లో ఉంటుంది. ఇప్పటి కొందరు యంగ్ స్టార్ హీరోయిన్లు ఒక సినిమా మొత్తం చేసిన ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోవడం లేదు అంటే రమ్య కృష్ణకు ఇప్పటికీ ఎంత డిమాండ్ ఉందో తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈమె ఎంత బిజీబిజీగా ఉన్నారు అన్నది తెలిసిందే.
ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లైగర్ సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇది కాకుండా తన భర్త కృష్ణవంశీ డైరెక్షన్ లో రంగమార్తాండ లో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఇలా వరుస బిగ్ ప్రాజెక్టు లు చేస్తూ చాలా చాలా బిజీగా ఉంటున్నారు నటి రమ్య కృష్ణ.