కరోనా వైరస్ వచ్చి సినిమా రంగంతో పాటుగా అన్ని రంగాలను దారుణంగా దెబ్బ తీసింది. రెండేళ్ల తర్వాత మెల్ల మెల్లగా సినిమా రంగం సైతం కుదుటపడింది. అయితే ప్రేక్షకులు మాత్రం కరోనా తర్వాత మాములుగా అప్డేట్ కాలేదు. అంతకు ముందు సినిమా మీద పిచ్చితో ఎటువంటి కథలను సినిమాగా తీసినా థియేటర్ కు వెళ్లి ఆదరించేవారు. కానీ కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంటిలోనే ఉంటూ ఓ టి టి ప్లాట్ ఫార్మ్ ద్వారా అన్ని రకాల సినిమాలు, వెబ్ సిరీస్ లు షార్ట్ ఫిలిమ్స్ ను చూసి సినిమా అంటే ఎలా ఉండాలి అన్న ఒక అవగాహనను తెచ్చుకున్నారు. దాని ఫలితమే సరైన కథలు లేకుండా వచ్చిన సినిమాలకు ఎలాంటి ఫలితాన్నిచ్చారో చూశాము. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి కరోనా తర్వాత ఒక్క హిట్ కూడా లేదంటే ప్రేక్షకులు ఎంత క్లారిటీగా ఉన్నారో చూడండి.

అందుకే కొత్త దర్శకులు అంతా మంచి కాన్సెప్ట్ లను ఎంచుకుని హిట్ లు కొడుతూ ముందుకు వెళుతున్నారు. యువ దర్శకుల దారిలోనే చాలా మంచి సీనియర్ దర్శకులు కూడా పయనించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అలంటి ఒక కొత్త రకం కథతో మన ముందు రానున్నారు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆర్ కల్కి. ఇందులో హీరో హీరోయిన్ లుగా దుల్కర్ సల్మాన్ మరియు శ్రేయ ధన్వంతరీ లు నటించారు. కాగా సన్నీ డియోల్ మరియు పూజ భట్ లు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాకు "చుప్... రివెంజ్ అఫ్ ఆర్టిస్ట్" అనే టైటిల్ తో రానుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ లు సినిమాపై అంచనాను పెంచారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సైతం విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇది ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ గా ఈ నెల 23 న విడుదల కానుంది.

అయితే ట్రైలర్ ను బట్టి చూస్తే ఇందులో ఒక ఫేక్ రివ్యూలను రాయడం ద్వారా సర్వం కోల్పోయిన వ్యక్తి సినిమాలకు రివ్యూస్ ఇచ్చే వారిని హత్య చేస్తూ ఉంటాడు. సినిమాలకు వాళ్ళు ఇచ్చే స్టార్స్ ను బట్టి వారి తలపై కూడా అన్ని స్టార్ లను రాస్తూ ఉంటాడు. ఈ సైకోను పట్టుకునే పోలీస్ గా సన్నీ డియోల్ ఎంట్రీ చూస్తే ఆద్యంతం ఆసక్తిగా నడిచే స్టోరీ గా అర్ధమవుతోంది. ఇక దుల్కర్ మరియు శ్రేయలు ఇందులో సినిమా స్టార్స్ గా కనిపించనున్నారు. మరి ఈ కొత్త కథతో వచ్చే సినిమా ఆకట్టుకుంటుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: