బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షారుక్ ఖాన్ ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి ప్రపంచ వ్యాప్తంగా హీరోగా అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తమిళ క్రేజీ దర్శకుడు అయినటు వంటి అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో నయనతార ,  ప్రియమణి ,  దీపికా పదుకొనే , విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ హీరోగా నటిస్తూ ఉండడం , కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీమూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల భారీ అంచనాలు నిలబడి ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ...  షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ క్రేజీ ప్రాజెక్ట్ జవాన్ లో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ,  ఈ మూవీ లో రజనీ కాంత్ పాత్ర ఈ మూవీ కే హైలెట్ గా నిలవనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీ కాంత్ , నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: