పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఖుషి సినిమా ప్రత్యేకం అనే విషయం తెలిసిందే.


ఎస్.జే సూర్య డైరెక్షన్ లో ఏఎం రత్నం నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ భూమిక కాంబో సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఈ జనరేషన్ అభిమానులు సైతం ఖుషి మూవీని ఎంతగానో ఇష్టపడతారు.


ప్రస్తుతం స్టార్ హీరోల పాత సినిమాలు 4కే టెక్నాలజీతో రిలీజవుతూ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. రెండు దశాబ్దాల క్రితం విడుదలైన ఖుషి మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీన ఈ సినిమాను రీ రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించగా ఈ సినిమాలోని పాటలు ఊహించని స్థాయిలో హిట్ అయ్యాయి.


 


ఈ సినిమాలోని అమ్మాయే సన్నగా పాటను ప్రేక్షకులు సులువుగా మరిచిపోలేరు. భూమికకు ఈ సినిమాతో ఒక విధంగా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కింది. ఖుషి సినిమా పవన్ కెరీర్ లో తొలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందనే విషయం తెలిసిందే. పవన్ ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ లో ఉన్నారని సమాచారం. అమెరికా నుంచి పవన్ వచ్చిన తర్వాత హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొననున్నారు.


 


కేవలం 50 రోజులలో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. పవన్ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవడంతో పాటు ఈ సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: