రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా మూవీ లలో , అంతకుమించిన మూవీ లలో హీరోగా నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రభాస్ వచ్చే సంవత్సరం సంక్రాంతి కి ఆది పురుష్ మూవీ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కాకపోతే ఇతర సినిమాలు విడుదలకు ఉండడంతో , ఇతర మూవీ లతో పోటీ పడడం ఇష్టం లేని ఆది పురుష్ మూవీ యూనిట్ ఈ సినిమాను సంక్రాంతి భారీ నుండి తప్పించినట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే ఆది పురుష్ సినిమా విషయంలో మాత్రమే కాకుండా ప్రభాస్ ఇది వరకు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మిర్చి మూవీ ని కూడా మొదట గా సంక్రాంతి కే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ మూవీ ని సంక్రాంతి బరి నుండి తప్పించారు. అలాగే ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధే శ్యామ్ మూవీ ని కూడా మొదట సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాకపోతే ఆ తర్వాత ఈ సినిమాను కూడా సంక్రాంతి బరి నుండి తప్పించి జనవరి తర్వాత కొన్ని నెలలకు విడుదల చేశారు.

ఇలా ప్రభాస్ ఈ మధ్య కాలంలో సంక్రాంతి కి తన సినిమాలను విడుదల చేయలేదు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఆఖరుగా యోగి సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు. ఈ సినిమాకు వి వి వినాయక్ దర్శకత్వం వహించగా , నయన తారమూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన యోగి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దానితో యోగి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. యోగి మూవీ తర్వాత ఇప్పటి వరకు ప్రభాస్ తన మూవీ ని సంక్రాంతి కి విడుదల చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: