సరిగ్గా ఓ 13 సంవత్సరాల క్రితం వచ్చిన అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అప్పటి ప్రేక్షకులని ఎంతగానో మెస్మరైజ్ చేసి భారీ విజయం సాధించింది. అప్పట్లోనే ఈ సినిమాలో అద్భుతమైన విజువల్స్ తో పండోరా అనే గ్రహాన్ని, కొత్త భాషని సృష్టించి దర్శకుడు జేమ్స్ కామెరూన్ అందర్నీ కూడా మాయ చేశాడు.ఇక మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమాకి పార్ట్ 2 రాబోతుంది. అవతార్:ది వే ఆఫ్ వాటర్ అనే టైటిల్ తో ఈ సినిమా డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా కూడా రిలీజ్ కానుంది.దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు అందరూ కూడా అవతార్ సినిమా 2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2డీ, 3డీ, 4డీఎక్స్ 3డీ ఇంకా అలాగే ఐమ్యాక్స్3డీ ఫార్మట్లలో అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమాని రిలీజ్ చేయనున్నారు. మన దేశంలో అయితే ఏకంగా హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఖచ్చితంగా 2.2 బిలియన్ డాలర్స్ రాబట్టాలి.అంటే దాదాపు 18 వేల కోట్లు వసూలు చెయ్యాలి. అవతార్ 1 సినిమా దాదాపు 30 వేల కోట్లు వసూళ్లు చేసి ఇప్పటికీ నెంబర్ 1 గా ఉంది. మరి అవతార్ 2 అవతార్ 1 ని దాటుతుందో లేదో చూడాలి.ఇప్పటికే ఈ సినిమా టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే ఈ సినిమా టికెట్ రేట్లు చూస్తే ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..అది కూడా ఒక్కో సిటీలో ఒక్కో రేటు, ఒక్కో ఫార్మేట్ కి ఒక్కో రేటు ఉండటమే కాకుండా సాధారణ సినిమాల కంటే కూడా చాలా ఎక్కువగా ఈ సినిమా టికెట్ రేట్స్ ఉండటంతో ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.


ఇండియాలోని మెయిన్ సిటీల్లో అవతార్ ది వే ఆఫ్ వాటర్ టికెట్ల రేట్లు చూసినట్లయితే..ఇక హైదరాబాద్ లో 4డీఎక్స్ ఫార్మెట్ లో టికెట్ ధర రూ. 350, బెంగళూరులో ఐమ్యాక్స్ ప్రీమియం సీట్ల ధర రూ. 1040 నుంచి 1500, 3డీ ప్రీమియం రూ.1650, ముంబయిలో 4డీఎక్స్ 3డీ ఫార్మెట్ లో మాక్సిమం రూ.1700, మినిమం రూ.740, ఇక ఢిల్లీలో ఐమ్యాక్స్ 3డీ ఫార్మేట్ లో రూ. 1000, ఇక కలకత్తాలో ఐమ్యాక్స్ 3డీ ఫార్మేట్ లో రూ. 800, అలాగే అహ్మదాబాద్ లో ఐమ్యాక్స్ 3డీ ఫార్మేట్ లో రూ.750, చండీగడ్ లో 4డీఎక్స్ 3డీ ఫార్మెట్ లో రూ.400, పూణెలో 4డీఎక్స్ 3డీ ఫార్మెట్ లో రూ.900 నుంచి 1200 వరకు ఉన్నాయి.ఉన్నాయి. మరి కొన్ని సిటీల్లో ఇంకా బుకింగ్స్ ఓపెన్ చేయాల్సి ఉంది. దీంతో ఈ టికెట్ రేట్లు చూసి సినీ ప్రేక్షకులు తెగ షాక్ అవుతున్నారు. ఇలా అయితే సాధారణ ప్రజలు అవతార్ సినిమా చూస్తారా అనే సందేశాలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: