సినీ ఇండస్ట్రీలోకి సినీ నేపథ్య కుటుంబం నుంచి వచ్చి నిలదొక్కుకోవాలి అంటే ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.  అలాగే మార్గం మధ్యలో ఎదురయ్యే ఆటు పోట్లు.. ఒడిదుడుకులు.. ఎత్తుపల్లాలు ఇలా ఎన్ని ఉన్నా సరే వాటిని అధిగమించి ఉన్నత స్థానానికి చేరుకోవాలి అప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతారు.  లేకపోతే ఇండస్ట్రీ నుంచి కనుమరుగవ్వాల్సిన  సందర్భం కూడా వస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ మొదట్లో సినిమా కథల ఎంపికల విషయంలో తప్పటడుగు వేసినా..  ఆ తర్వాత సరైన పద్ధతిలో సినిమా కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు.  ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకున్న రామ్ చరణ్.. ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ తో తన 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.


అయితే ఈ సినిమా విడుదల ఇంకా ప్రకటించలేదు.  కానీ అప్పుడే తన 16వ చిత్రం పూజా కార్యక్రమాలను ఈరోజు హైదరాబాదులో ఘనంగా నిర్వహించబోతున్నారు. #RC16 అనే తాత్కాలిక వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు జనవరిలో ప్రారంభం అవుతుందట.  అంతేకాదు రెగ్యులర్ షూటింగ్ సమయంలోనే మొత్తం తారాగణం అలాగే సిబ్బంది వివరాలు కూడా వెల్లడిస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఇప్పటికే జెర్సీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు రామ్ చరణ్ తో మరొక అద్భుతమైన కథతో మన ముందుకు రానున్నారు.


ఈ సినిమాను ఎన్విఆర్ సినిమాస్ బ్యానర్ పై ఎన్ వి ప్రసాద్ తో పాటు యూవి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీకృష్ణారెడ్డి , ప్రమోద్ ఉప్పలపాటి  సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు . అయితే ఇందులో హీరోయిన్ గా రష్మిక మందాన పేరు వినిపిస్తోంది.కనే ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి  మొత్తం తారాగణం తెలుసుకోవాలంటే జనవరి వరకు ఎదురు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: