తమిళ సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్న విష్ణు విశాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విష్ణు విశాల్ "రాక్షసన్" మూవీ ద్వారా మంచి విజయాన్ని అందుకుని తమిళ బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను కూడా అందుకున్నాడు. ఈ మూవీ ద్వారా విష్ణు విశాల్ కు మంచి గుర్తింపు లభించింది. తెలుగు లో ఈ మూవీ రాక్షసుడు పేరుతో తెరకెక్కింది. ఈ మూవీ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే విష్ణు విశాల్ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఎఫ్ ఐ ఆర్ మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను కూడా పలకరించాడు. కాకపోతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించ లేక పోయింది.

తాజాగా విష్ణు విశాల్ "మట్టి కుస్తీ" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ డిసెంబర్ 2 వ తేదీన విడుదల కాబోతుంది. చెల్ల అయ్యవు ఈ మూవీ కి దర్శకత్వం వహించగా , ఐశ్వర్య లక్ష్మి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని తెలుగు లో కూడా డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే మట్టి కుస్తీ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి మట్టి కుస్తీ మూవీ కి క్లీన్ "యు" సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా మూవీ ఈ యూనిట్ లాక్ చేసింది. మట్టి కుష్టు మూవీ 2 గంటల 26 నిమిషాల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: