‘బాహుబలి’ సక్సస్ ను చాల తెలివిగా ఉపయోగించుకుని ప్రభాస్ ఇప్పుడు నాలుగు సినిమాలలో నటిస్తున్నాడు. ‘బాహుబలి’ తరువాత సక్సస్ లేకపోయినప్పటికీ ప్రభాస్ పారితోషికం 100 కోట్ల స్థాయికి చేరుకుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ సక్సస్ ను జూనియర్ తెలివిగా తన కెరియర్ కు ఉపయోగించుకోవడం లేదు అంటూ తారక్ అభిమానులు బాధ పడుతున్నట్లు టాక్.


‘ఆర్ ఆర్ ఆర్’ ఘన విజయం తరువాత తారకు కొరటాలతో చేయబోతున్న మూవీ షూటింగ్ వెంటనే ప్రారంభం అవుతుందని అందరు ఆశించారు. అయితే జరిగింది వేరు. ‘ఆచార్య’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ఎలర్ట్ అయిన జూనియర్ కొరటాల చెప్పిన కథలో అనేక మార్పులు చేర్పులు చేయించడంతో ఆమూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావడం చాల ఆలస్యం అయింది.


మధ్యలో ఈమూవీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుంది అన్న ఊహాగానాలు కూడ వచ్చాయి. ఎట్టకేలకు ఈమూవీ షూటింగ్ వచ్చే సంవత్సరం జనవరి నుండి ప్రారంభం అవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అన్నీ కుదిరితే వచ్చే సంవత్సరం దసరాకు లేదంటే ఆపై సంవత్సరం సంక్రాంతికి కాని ఈమూవీ విడుదలకాదు అని అంటున్నారు. దీనితో ప్రశాంత్ నీల్ తో జూనియర్ చేయవలసిన మూవీ మరింత ఆలస్యం అయ్యే ఆస్కారం కనిపిస్తోంది.


ఇది ఇలా ఉండగా దర్శకుడు బుచ్చిబాబు జూనియర్ ను దృష్టిలో పెట్టుకుని వ్రాసిన కథ తారక్ కు నచ్చినప్పటికీ కొరటాలతో మూవీ ఆతరువాత ప్రశాంత్ నీల్ తో మూవీ ఇలా రెండు పూర్తి అయ్యేదాకా బుచ్చిబాబు వేచి చూడలేని పరిస్థితులలో తారక్ స్వయంగా చరణ్ కు ఫోన్ చేసి బుచ్చిబాబు కథ చాల బాగుంటుంది అని చెప్పడంతో చరణ్ బుచ్చిబాబుల కాంబినేషన్ సెట్ అయింది అని అంటున్నారు. అయితే రెండు సంవత్సరాలు బుచ్చిబాబు జూనియర్ కోసం కష్టపడి వ్రాసిన కథ ఇప్పుడు చరణ్ దగ్గరకు వెళ్లిపోవడంతో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ను ఎంచుకోవడంలో తారక్ కన్ఫ్యూజ్ అవుతున్నాడ అంటూ అభిమానులు బాధ పడుతున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: