బాలకృష్ణ హోస్ట్ గా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ 1 సక్సెస్ ఫుల్ గా పూర్తి అయిన విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితమే ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో సీజన్ 2 కూడా ప్రారంభమైంది. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని ఎపిసోడ్ లు కూడా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సీజన్ 2 మొదటి ఎపిసోడ్ కు చంద్రబాబు నాయుడు , లోకేష్ లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

అలాగే విశ్వక్ సేన్ ,  సిద్దు జొన్నలగడ్డ , అడవి శేషు , శర్వానంద్ లాంటి యువ హీరోలు కూడా ఈ టాక్ షో కు ఇప్పటికే విచ్చేశారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ టాక్ షో కి వచ్చాడు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు , కోదండ రామి రెడ్డి , అల్లు అరవింద్ , సురేష్ బాబు లు కూడా ఈ టాక్ షో కు విచ్చేశారు. ప్రస్తుతం రాఘవేంద్రరావు , కోదండ రామి రెడ్డి  , అల్లు అరవింద్ , సురేష్ బాబు లకు సంబంధించిన ఎపిసోడ్ ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 

ఇది ఎలా ఉంటే ఆన్ స్టాపబుల్ సీజన్ 2 కు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ టాప్ షో కు రెబల్ స్టార్ ప్రభాస్ మరియు గోపీచంద్ లు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఎపిసోడ్ ను డిసెంబర్ 11 వ తేదీన షూట్ చేయడానికి ఆహ నిర్వాహ బృందం ఇప్పటికే అన్ని పనులను చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా అద్భుతమైన ప్రేక్షకాదాలను పొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: