తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు తీసుకు వెళుతున్న అడవి శేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అడవి శేషు ఇప్పటికే వరుసగా క్షణం , గూఢచారి , ఎవరు , మేజర్ విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న అడవి శేషు తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటించాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా  ఈ మూవీ లో నటించగా శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీ ని నాచురల్ స్టార్ నాని నిర్మించాడు. ఈ మూవీ డిసెంబర్ 2 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిందో తెలుసుకుందాం.
మూవీ నైజాం ఏరియాలో 1.92 కోట్లు .
సీడెడ్ లో 38 లక్షలు .
యు ఏ లో 53 లక్షలు .
ఈస్ట్ లో 29 లక్షలు .  వెస్ట్ లో 19 లక్షలు . గుంటూరు లో 33 లక్షలు .  కృష్ణ లో 24 లక్షలు .  నెల్లూరు లో 15 లక్షలు .  మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు హిట్ ది సెకండ్ కేస్ మూవీ 4. 03 కోట్ల షేర్ 6.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.


మొదటి రోజు కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఈ మూవీ 0.45 కోట్లు .  ఓవర్సీస్ లో  1.95 కోట్లు మొత్తంగా ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 6.43 కోట్ల షేర్ ను ,  11.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మొదటి రోజు హిట్ ది సెకండ్ కేస్ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: