నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ టాక్ షో సీజన్ 2 కొనసాగుతుంది . ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ 2 లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు , లోకేష్ , సిద్దు జొన్నలగడ్డ , విశ్వక్ సేన్ ,  శర్వానంద్ , అడవి శేషు లు విచ్చేశారు . వీరి ఎపిసోడ్ లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది . ఇది ఇలా ఉంటే తాజాగా ఆన్ స్టాపబుల్ యూనిట్ మరో ఎపిసోడ్ ను విడుదల చేసింది . 

తాజా ఎపిసోడ్ లో ఆన్ స్టాపనుల్ కు 100 కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించినటు వంటి దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు , అలాగే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి అలనాటి కాలంలో స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా కొనసాగిన కోదండరామిరెడ్డి , ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించి ప్రస్తుతం కూడా సినీ రంగంలో చురుగ్గా సినిమాలను నిర్మిస్తున్న అల్లు అరవింద్ , సురేష్ బాబు లు ఈ ఎపిసోడ్ కు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. వీరికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో కు కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. తాజాగా వీరి నలుగురు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ ఎపిసోడ్ కు సూపర్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ ఎపిసోడ్ ను విడుదల చేసిన రెండు రోజుల్లోనే 30 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది. ఈ విషయాన్ని తాజాగా ఆహా నిర్వాహక బృందం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: