టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల చిరు చేసిన మలయాళ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా వచ్చిన గాడ్ ఫాదర్ టాక్ పరంగా పర్వాలేదనిపించినా కమర్షియల్ గా మెప్పించలేదన్నది కాదనలేని వాస్తవం. కాగా ప్రస్తుతం రెండు ప్రాజెక్టులను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు మెగాస్టార్ చిరు. అందులో ఒక సినిమా మాత్రం బాబీ డైరెక్షన్ లో విశాఖపట్టణం బ్యాక్ గ్రౌండ్ తో మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే క్యాచీ మాస్ టైటిల్ ను పెట్టారు. ఇందులో మాస్ మహారాజ రవితేజ చిరుకు తమ్ముడిగా నటిస్తున్నట్లు తెలిసిందే.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన శృతిహాసన్ మరియు రవితేజకు జోడీగా కేథరిన్ నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంటుగా చిత్ర బృందం విడుదల చేసిన ఐటెం సాంగ్ వేర్ ఈజ్ ది పార్టీ ప్రేక్షకులను మరియు చిరు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ ను తీసుకున్నారు. ఈ మధ్యన డీఎస్పీ పైన కూడా కాపీ ట్యూన్స్ ఇస్తున్నాడన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అందుకే మ్యూజిక్ పై అందరికీ చాలా అంచనాలు ఉన్నాయి, ఇక మొదటి సాంగ్ కూడా హిట్ కావడంతో మిగిలిన సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై చర్చలు జరుగుతున్నాయి.

సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించకపోయినా టాలీవుడ్ వర్గాలు సంక్రాంతి పండుగకు విడుదల అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు. సంక్రాంతి బరిలో ఇప్పటికే బాలయ్య బాబు వీరసింహారెడ్డి తో ఖర్చీఫ్ వేసుకుని కూర్చున్నాడు. ఈ రెండు సినిమాల మధ్యలో భారీ పోటీ ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఎవరు విన్నర్ గా నిలుస్తారు ? ఎన్ని కోట్ల వసూలు అందుకుంటారు అన్న విషయాలు తెలియాలంటే మరో 40 రోజులు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: