కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో దళపతి విజయ్ నెక్స్ట్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్యనే వారిసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. తెలుగులో సినిమా పెద్దగా ఆడకపోయినా తమిళ ఆడియన్స్ కు ఆ సినిమా బాగా నచ్చేసింది. దళపతి 67వ సినిమాను లోకేష్ చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. విక్రం సినిమా తర్వాత లోకేష్ సినిమా అనగానే అంచనాలు పెరిగాయి ఇప్పుడు విజయ్ తో అదే తరహా సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.

దళపతి 67వ సినిమా ఓ పక్క షూటింగ్ మొదలవగా మరోపక్క సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేసినట్టు తెలుస్తుంది. అందిన సమాచారం ప్రకారం ఈ ఇయర్ అక్టోబర్ 19న దళపతి 67వ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. అంటే దసరా బరిలో విజయ్ సినిమా ఉంటుందని చెప్పొచ్చు. సంక్రాంతికి వచ్చి సందడి చేసిన విజయ్ దసరాకి మరో సినిమా టార్గెట్ పెట్టుకున్నాడు. విజయ్ 67వ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉండగా సినిమాలో విజయ్ పాత్ర వేరే లెవల్ అంటూ ఇంకాస్త హైప్ క్రియేట్ చేస్తున్నారు.

లోకేష్ సినిమాలకు తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఉంది. తప్పకుండా దళపతి 67వ సినిమా ఇక్కడ కూడా హంగామా చేస్తుందని చెప్పొచ్చు. అసలైతే వారసుడు బైలింగ్వల్ గా చేయాలని అనుకోగా అది కుదరలేదు. అందుకే విజయ్ వారసుడుని లైట్ తీసుకున్నాడు. దళపతి 67వ సినిమా కోసమైనా విజయ్ తెలుగు లో ప్రమోషన్స్ చేస్తాడా లేదా అన్నది చూడాలి. లోకేష్, విజయ్ ఈ కాంబో మరోసారి వెండితెర మీద అద్భుతాలు సృష్టించాలని చూస్తుంది. దళపతి 67 ఈ ఏడాది రిలీజైతే ఈ సంవత్సరం ఫ్యాన్స్ కి విజయ్ నుంచి రెండు సినిమాలు వచ్చినట్టు లెక్క.


మరింత సమాచారం తెలుసుకోండి: