టాలీవుడ్ టాలెంటెడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న లేటెస్ట్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా 'దసరా'. ఈ సినిమాకి సంబంధించిన ఆర్థిక విషయాలు ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారాయి.టాలీవుడ్ మిడ్ రేంజ్ స్టార్ హీరోల్లో ఒకరైన నాని సినిమాల బడ్జెట్ విషయానికి వస్తే సాధారణంగా  రూ.30 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తుంటారు. అంత బడ్జెట్ పెడితే రూ.50 కోట్ల రేంజ్ లో నాని సినిమాకి బిజినెస్ జరిగేది. ఆ విధంగా నానిని నమ్ముకున్న నిర్మాతలు లాభపడేవారు. అయితే నాని గత సినిమా ప్లాప్ గా నిలిచింది.ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన 'అంటే సుందరానికీ' సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం వర్కవుట్ కాలేదు.అయినప్పటికీ నాని లేటెస్ట్ సినిమా 'దసరా' సినిమాకి ఏకంగా రూ.35 కోట్లు పెట్టడానికి రెడీ అయిపోయారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. ఆయన తన గత సినిమాలతో ఎఫెక్ట్ అయినప్పటికీ.. ఈ సినిమా మీద భారీ బడ్జెట్ పెట్టడానికి రెడీ అయిపోయారని సమాచారం తెలుస్తుంది.


అయితే ఒక సినిమా మొదలయ్యే ముందు ఇంత బడ్జెట్ లో సినిమా చేయాలని అనుకోవడం ఇంకా ఆ తరువాత బడ్జెట్ పెరిగిపోవడం కామన్ అయిపోయింది.సాధారణంగా ఒక ఐదు నుంచి పది కోట్ల రేంజ్ లో దర్శకులు బడ్జెట్ ని పెంచేసే ఛాన్స్ ఉంది. కానీ 'దసరా' సినిమాకి ఏకంగా బడ్జెట్ డబుల్ అయిపోవడం ఇప్పుడు పెద్ద షాకింగ్ గా ఉంది. అయితే కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్లానింగ్ ప్రకారం సినిమాని తీయలేకపోయారా..? లేక క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని సినిమాకి బడ్జెట్ పెంచేశారా..? అనే విషయాలు తెలియదు కానీ.. బడ్జెట్ ముందు అనుకున్నదానికంటే రెట్టింపు అయిందట. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ దక్కించుకుంది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ సూపర్, అదిరిపోయింది అంటూ కామెంట్స్ పెట్టడంతో ఈ సినిమాని ఇంకా బాగా తెరకెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: