బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరిలో కూడా టాప్ లో కొనసాగుతూ ఉంటాడు కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోనే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ ఎంత పెద్ద సెలబ్రిటీయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక దాదాపు మూడు దశాబ్దాలకు పైగానే సినిమాను చేస్తూ కోట్ల మంది అభిమానులను.. వందల కోట్ల ఆస్తులను కూడా సంపాదించుకున్నాడు. అయితే ఇక ఇలా స్టార్ హీరోగా కొనసాగుతున్న వ్యక్తి ఎవరైనా సరే వందల కోట్ల విలువ చేసే ఇంటిలో లగ్జరీ లైఫ్ ను గడపడం చూస్తూ ఉంటాం.


 అయితే సల్మాన్ ఖాన్ లక్సరీ లైఫ్ గడుపుతున్నాడు. కానీ ఇంకా సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లోనే ఉంటున్నాడు అన్నది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇటీవల కాలంలో ఎంతోమంది సినీ నటీనటులు వందల కోట్లు పెట్టి విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేస్తూ ఉంటే సల్లు భాయ్ మాత్రం ముంబైలోని వన్ బిహెచ్కె ఫ్లాట్లోనే ఉంటున్నాడట.  ఈ విషయాన్ని ఒక టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించాడు సల్మాన్ ఖాన్. 2019లో ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ మాట్లాడాడు.. 12 ఏళ్ల క్రితం ఒక బంగ్లా కొనాలని నిర్ణయించుకున్నా. ఈ విషయం నాన్నకు చెప్పాను. నేను చాలా మంచి స్థలం కోసం చూస్తున్న.. అప్పుడు బంగ్లా ధర 22 కోట్లు అని చెప్పారూ.  నీకు ఇష్టమైతే స్థలం కొనుక్కో అన్నారు నాన్న. నేను యజమానిని  ఆ ఇంటికి తీసుకువచ్చి.. ప్లేస్ బాగుందని చెప్పాను.. నాకు ఎంతగానో నచ్చే ప్లేస్ లో ఒక సమస్య ఉందని చెప్పా.. స్థలం 22 కోట్లు అయితే తన దగ్గర 20 కోట్లు మాత్రమే ఉన్నాయి అని చెప్పాను అంటూ సల్మాన్ ఖాన్ తెలిపారు. ఆ తర్వాత యజమాని సల్మాన్ తో కలిసి భూమి లావాదేవీనుని నిర్ధారించారు.


 ఇక ఆ తర్వాత తన దగ్గర కొంత మొత్తంలో డబ్బు తక్కువగా ఉన్నప్పటికీ ఎంతో కష్టపడి సల్మాన్ ఖాన్ ఇక ఆ బంగ్లాని కొనుగోలు చేశారట. ఇక అప్పటినుంచి సల్మాన్ ఖాన్ కెరియర్ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగిందట. దీంతో ఇక ఆ సింగిల్ బెడ్ రూమ్ హౌస్ సల్మాన్ ఖాన్ కి ఒక సెంటిమెంట్ గా మారిపోయిందట. అందుకే ఇప్పుడు స్టార్ గా ఎదిగి వందల కోట్ల రూపాయలు సంపాదించినప్పటికీ ఇప్పటికీ సల్మాన్ ఖాన్ ఆ సింగిల్ బెడ్ రూమ్ హౌస్ లోనే ఉంటున్నాడట. ఆ బంగ్లాను తనకు నచ్చినట్లుగా మార్పులు చేర్పులు చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: