సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన టాలెంట్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రారంభం అయింది. ఈ మూవీ షూటింగ్ ను అదిరిపోయే భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ఈ మూవీ బృందం ప్రారంభించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా బాగం షూటింగ్ పూర్తి అయ్యింది.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నైట్ సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణను మూవీ యూనిట్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాల చిత్రీకరణ ఈ సినిమా కోసం వేసిన భారీ ఇంటి సెట్ లో ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో శ్రీ లీల ... పూజా హెగ్డే ... మహేష్ సరసన హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... జయరామ్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ మహేష్ సంబంధించిన ఈ మూవీ లోని ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ మూవీలోని మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాకి ఇప్పటి వరకు టైటిల్ ని ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతున్న కారణంతో ఈ మూవీ షూటింగ్ "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి గుంటూరు కారం అనే టైటిల్ ను ఈ మూవీ యూనిట్ కొంత కాలం గతం పరిశీలించినట్లు ... కాకపోతే ఈ టైటిల్ మూవీ యూనిట్ కు అంతా సంతృప్తికరంగా అనిపించకపోవడంతో ఈ టైటిల్ ను పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: