నాని అంచనాలకు అనుగుణంగా ‘దసరా’ 100 కోట్ల సినిమాగా మారడంతో నాని కోరిక నెరవేరింది. అయితే ఈమూవీ కలక్షన్స్ కు చెక్ పెట్టడానికి రవితేజా ‘రావణాసుర’ మూవీతో చేసిన ప్రయత్నాలు ఏమాత్రం విజయవంతం అయ్యే సూచనలు కనిపించడంలేదు. ఈమూవీకి టాక్ తో పాటు రివ్యూలు కూడ చాల పూర్ గా రావడంతో ‘రావణాసుర’ బయ్యర్లు టెన్షన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

 

‘ధమాక’ ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలు సూపర్ హిట్ కావడంతో ‘రావణాసుర’ మూవీతో మాస్ మహారాజ హ్యాట్రిక్ హిట్ అందుకుంటారు అని అనుకున్నారు. అయితే ఈమూవీని చూసిన సగటు ప్రేక్షకుడు 10 తలల రావణాసురుడు కాదు ఈమూవీ చూసిన వారికి 10 రెట్లు తలనొప్పి ఖాయం అంటూ చేస్తున్న కామెంట్స్ తో ఈ వారాంతంలో సినిమా చూడాలి అని భావించే వారికి ‘దసరా’ మూవీ తప్ప మరొక ఆప్క్షన్ లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

 

‘రావణాసుర’ మూవీతో పాటు విడుదలైన కిరణ్ అబ్బవరం ‘మీటర్’ మూవీ పరిస్థితి కూడ అలాగే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న కిరణ్ అబ్బవరంకు ఈమూవీ కూడ నిరాశను మాత్రమే మిగిల్చింది అని అంటున్నారు. దీనితో ఈవారం కూడ బాక్స్ ఆఫీసు వద్ద ‘దసరా’ దూకుడు కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. ఈమూవీకి ఉత్తరాదిలో పెద్దగా స్పందన లేకపోయినా తెలుగు రాష్ట్రాలలో సగటు ప్రేక్షకుడు నాని నటనకు ఫిదా అవ్వడంతో కలక్షన్స్ విషయంలో ‘దసరా’ సినిమాకు ఎదురులేకుండా పోయింది.

 

 

వచ్చేవారం సమంత ‘శాకుంతలం’ విడుదల కాబోతోంది. ఈమూవీ గురించి ఎంతగా ప్రమోట్ చేస్తున్నప్పటికీ ఈమూవీ పై ఇంకా తెలుగు ప్రేక్షకులలో మ్యానియా ఏర్పడలేదు. సాధారణంగా పురాణాలు చారిత్రాత్మక సినిమాలకు యూత్ దూరంగా ఉంటారు. దీనితో ‘శాకుంతలం’ టాక్ కూడ అటూ ఇటూ అయితే వచ్చేవారం కూడ ‘దసరా’ హవా కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. మరి సమంత అయినా నానీకి ఎంతవరకు చెక్ పెట్టగాలదో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: