టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలకు సొంతంగా బ్యానర్ లు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. చాలా మంది హీరోల కోసం సొంతంగా బ్యానర్లు లేకపోయినప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ లో నిర్మాతలు ఉన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి సైతం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఉంది. కళ్యాణ్ రామ్ బ్యానర్ అయిన ఈ బ్యానర్ లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చేస్తే నిర్మాణ బాధ్యతలను పూర్తిగా ఆయనే చూసుకుంటారట.అయితే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఒక కొత్త బ్యానర్ను మొదలుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఆ బ్యానర్ లో నాని హీరోగా ఒక సినిమా రాబోతోందని అంటున్నారు.

 అయితే ఉన్నట్టుండి అకస్మాత్తుగా జూనియర్ ఎన్టీఆర్ కొత్త బ్యానర్ను ప్రకటించడం వెనుక వేరే షాకింగ్ ప్లాన్ ఉందని తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు కళ్యాణ్ రామ్ పై తనకున్న ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. అయితే రాబోయే రోజుల్లో కళ్యాణ్రామ్ బ్యానర్ తో కలిసి సినిమాలో నిర్మించాలని జూనియర్ ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారట.ఈ బ్యానర్ల ద్వారా ప్రతిభావంతమైన నటులను దర్శక నిర్మాతలను ప్రోత్సహించాలని ఫిక్సయిన జూనియర్ ఎన్టీఆర్ ఈ బ్యానర్ ని స్థాపించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ వార్త విన్న వారందరూ జూనియర్ ఎన్టీఆర్ చాలా బాగుంది

 అంటూ కామెంట్లను సైతం పెడుతున్నారు.దీనికి  సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల ద్వారా సంపాదిస్తున్న మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు అంతకంతకు పెరుగుతుండడంతో జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇక జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తోంది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. దీంతో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: