దర్శక ధీరుడు రాజ్యమౌళి ఎంత పెద్ద దర్శకుడో మనందరికీ తెలిసిందే. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా చలామణి అయిన రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయాడు.దాని తర్వాత ఇటీవల వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లి తెలుగు వాడి సత్తా ఏంటో నిరూపించడు రాజమౌళి. ఇక త్రిబుల్ ఆర్ సినిమా అన్ని దేశాల్లో తన పేరు మార్మోగేలా చేసుకున్నాడు రాజమౌళి. ఈ క్రమంలోనే ఈ సినిమా తర్వాత మొదటిసారి యాడ్లో కనిపించి మరొకసారి తానేంటో నిరూపించుకున్నాడు.

 అన్ని సక్సెస్ఫుల్గా కొనసాగిస్తూ వస్తున్న రాజమౌళి ఇప్పటివరకు ఎటువంటి యాడ్స్ లో కనిపించింది లేదు. ఇక మొదటిసారి ఆయన ఒక ప్రముఖ మొబైల్ కంపెనీ కోసం ఒక యాడ్లో కనిపించడం జరిగింది. అయితే ఈ యాడ్ షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్ళాడు రాజమౌళి. ఇక రాజస్థాన్లో తన కుటుంబంతో కలిసి వెళ్లి అక్కడ యాడ్ షూట్ తో పాటు వెకేషన్ ని సైతం ఎంజాయ్ చేశారు ఆయన. ఇక వాటికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తే ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అయితే రాజమౌళి ఈ యాడ్ షూటింగ్ కోసం ఆయన తీసుకున్న

రెమ్యూనరేషన్ వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి ఒక్క  సినిమాకు సుమారు 150 కోట్ల వరకు  రెమ్యూనరేషన్ తీసుకుంటాడని సమాచారం. అయితే ఈ యాడ్ కోసం రాజమౌళి దాదాపుగా మూడు కోట్ల రూపాయల రేంజ్ లో రమ్యునరేషన్ ని అందుకున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల ఆయన యాడ్ సైతం టెలికాస్ట్ అయ్యింది. ఈ యాడ్లో రాజమౌళి ఎంత స్టైలిష్ గా ఉన్నాడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఆయన మొదటిసారి చేసిన యాడ్ కోసం రాజమౌళి తీసుకున్నా రెమ్యూనరేషన్ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: