తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో విశాల్ ఒకరు. ఇప్పటికే విశాల్ ఎన్నో సినిమా లలో నటించి అందులో ఎన్నో మూవీ లతో మంచి విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా పందెం కోడి మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నుండి ఈ హీరో తాను నటించిన అనేక మూవీ లను టాలీవుడ్ లో కూడా విడుదల చేశాడు. వాటిలో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాయి.

దానితో ఈ హీరో కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే విశాల్ ఆఖరిగా "లాఠీ" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విశాల్ "మార్క్ ఆంటోనీ" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత విశాల్ కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాలెంటెడ్ డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి హరి దర్శకత్వం లో రూపొంద బోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు.

మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ జూలై 23 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే విశాల్ ... హరి కాంబినేషన్ లో ఇది వరకు "పూజ" అనే మూవీ రూపొందింది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇలా ఇప్పటికే విశాల్ ... హరి కాంబినేషన్ లో రూపొందిన "పూజ" మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో వీరి కాంబినేషన్ లో రూపొందబోతున్న రెండవ మూవీ పై తమిళ సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: