మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ తన సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే తెలుగు ప్రేక్షకులందరికీ మెగా ప్రిన్స్ గా కూడా మారిపోయాడు. ఇక ఇప్పుడు గాండీవ దారి అర్జున అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మొదటిసారి ఒక స్పై పాత్రలో నటించబోతున్నాడు వరుణ్ తేజ్. సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతుంది అన్నది తెలుస్తుంది.


 అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా ఎన్నో రోజులు లేని నేపథ్యంలో ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు. ఎన్నో ఇంటర్వ్యూలలో  పాల్గొంటూ ఉన్నాడు. అయితే వరుణ్ తేజ్ ఏ ఇంటర్వ్యూకి వెళ్లిన ఇక ఒకే విషయం గురించి ప్రశ్న ఎదురవుతుంది. ఆ విషయం ఏంటో మీకు కూడా తెలిసే ఉంటుంది. అదే లావణ్య త్రిపాఠి తో పెళ్లి గురించి. అసలు వీరిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైంది. పెళ్లి వరకు ఎప్పుడు వెళ్ళింది అనే విషయం తెలుగు ప్రేక్షకులకు అస్సలు తెలియదు. మధ్యలో వీరి ప్రేమ విషయం పై వార్తలు వచ్చిన అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని అందరూ అనుకున్నారు.


 కానీ సడన్ గా ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు అని చెప్పాలి. కాగా  లావణ్య త్రిపాఠితో ప్రేమ విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వరుణ్ తేజ్. లావణ్యతో నా లవ్ స్టోరీ మొదలై ఐదేళ్లు అయింది అంటూ చెప్పడంతో అందరూ షాక్ పోతున్నారు. ఐదేళ్ల నుంచి ఎవరికి తెలియకుండా ఎలా సీక్రెట్ గా ఉంచాడో అని చర్చించుకుంటున్నారు. అయితే చాలా కాలం పాటు ఫ్రెండ్స్ గా ఉన్నాం. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో మరో అడుగు ముందుకు వెళ్లాం. ఫస్ట్ నేనే లావణ్య కు ప్రపోజ్ చేశా. మా ప్రేమ గురించి ఇంట్లో చెబితే వాళ్ళు ఒప్పుకున్నారు  ఇప్పటికే చాలా గిఫ్ట్ లు ఇచ్చింది. ఇప్పుడు నేను వాడుతున్న ఐఫోన్ కూడా ఆమె ఇచ్చిన గిఫ్టే. అయితే లావణ్య ఎంతో మెచ్యూర్డ్  ఆలోచిస్తుంది అంటూ వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. కాగా వీరిద్దరీ పెళ్లి  డిసెంబర్లో జరుగుతుందని టాక్  కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: