ఆపై వెంకటేష్ తో తీసిన నారప్ప రీమేక్ అయినప్పటికీ ఆమూవీ ఓటీటీ లో విడుదల అవడంతో ఆమూవీ శ్రీకాంత్ కెరియర్ కు ఏమాత్రం సహాయపడలేదు. దీనితో రూట్ మార్చిన ఈదర్శకుడు ఈసారి సీరియస్ జానర్ సినిమా వైపు వచ్చినట్లు సంకేతాలు వస్తున్నాయి. లేటెస్ట్ గా ఇతడు తీసిన ‘పెదకాపు’ పార్ట్ 1 ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ పై అంచనాలు పెరుగుతున్నాయి.
విరాట్ కర్ణ అనే యంగ్ హీరోగా పరిచయం చేస్తూ ‘అఖండ’ ఫేమ్ మిర్యాల రవీంద్రరెడ్డి నిర్మిస్తున్న ఈభారీ బడ్జెట్ ఇంటెన్స్ డ్రామా సెప్టెంబర్ 29న విడుదలకాబోతోంది. ఈమూవీ ట్రైలర్ చూసిన వారికి ఈమూవీ కధకు సంబంధించిన లీకులు వస్తున్నాయి. నదీ ఒడ్డున ఉన్న ఒక గ్రామంలో కులాల మధ్య సమరంలో నిత్యం అక్కడ ఎన్నో ప్రాణాలు పోతూ ఉండటం ‘పెదకాపు’ లతో జరిగే ఆధిపత్యపోరులో అణిచివేత తప్ప మరో ఉన్నతి ఎరుగని ఒక అణగారిన కులానికి చెందిన యువకుడు ఈవ్యవస్థ పై ఎలా తిరగపడ్డాడు అన్న కధలో ఎన్నో మలుపులు ఉన్నట్లు కనిపిస్తోంది.
ఈ ట్రైలర్ లో విజువల్స్ మొత్తం చాలా ఇంటెన్సిటీతో ఉండటంతో పాటు గ్రామాలలో పంతాలు చిచ్చులు ఏస్థాయిలో ఉంటాయో కళ్ళకు కట్టినట్టు శ్రీకాంత అడ్డాల చూపించడంతో ఈమూవీ పై అంచనాలు పెరిగి పోతున్నాయి. ఈమూవీలో శ్రీకాంత్ అడ్డాల మరో కీలక పాత్రలో నటిస్తూ ఉనడటం మరో ట్విస్ట్. మిక్కీ జె మేయర్ నేపధ్య సంగీతం చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం ఈమూవీ విజయానికి సహాహాయ పడే ఆస్కారం కనిపిస్తోంది. అయితే ఈమూవీ ఏకంగా బోయపాటి రామ్ ల ‘స్కంద’ జారెన్స్ ‘చంద్రముఖి 2’ లతో పోటీ పడుతూ ఉండటంతో శ్రీకాంత్ అడ్డాల సాహసం చాలామందికి షాక్ ఇస్తోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి