
కాగా అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఏఎన్ఆర్ పంచలోహ విగ్రహ ఆవిష్కరణ వెంకయ్య నాయుడు చేతుల మీదుగానే జరిగింది. అయితే ఇక ఈవెంట్ కి అటు సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు అని చెప్పాలి. ఇక టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని ఫ్యామిలీల నుంచి కుటుంబ సభ్యులు వచ్చారు. కానీ ఒక్క నందమూరి ఫ్యామిలీ నుంచి మాత్రం ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో కనిపించలేదు. ముఖ్యంగా అన్ని ఈవెంట్స్ కి హాజరయ్యే బాలయ్య.. అక్కినేని ఈవెంట్ కి మాత్రం హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారిపోయింది.
దీంతో బాలయ్య ఎందుకు రాలేదు అన్న చర్చ తెరమిదికి రాగా ఒక ఆసక్తికర కారణం వైరల్ గా మారిపోయింది. బాలయ్య అక్కినేని విగ్రహావిష్కరణకు హాజరు కాకపోవడానికి నాగార్జునతో ఉన్న విభేదాలు కారణం అంటూ ప్రచారం జరుగుతుంది. బాలయ్య, నాగార్జున ఎప్పుడు ఎక్కడ కలిసి మాట్లాడుకుంది లేదు. వీరిద్దరి మధ్య ఇంత వైరం ఎందుకు వచ్చింది అసలు ఎక్కడ వీరిద్దరికి చెడింది అనే అంశంపై ఎవరికి క్లారిటీ లేదు. అయితే ఇటీవల వీర సింహారెడ్డి ఈవెంట్లో బాలయ్య అక్కినేని తొక్కినేని అని కామెంట్ చేయడం పెద్ద వివాదం అయింది. బాలయ్య ఈవెంట్స్ కి నాగార్జున.. నాగార్జున ఈవెంట్స్ కి బాలయ్య చాలా రోజుల నుంచి హాజరు కావట్లేదు. ఇప్పుడు బాలయ్య రాకపోవడంతో మరోసారి ఈ వార్త వైరల్ గా మారింది.