ప్రతిసారి సంక్రాంతి పండుగ వచ్చింది అంటే తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అనేక సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఎక్కువ శాతం సంక్రాంతి పండుగకు స్టార్ హీరోలు నటించిన సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అవుతూ ఉంటాయి. అందులో భాగంగా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు కూడా అనేక క్రేజీ సినిమాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయబోతున్నాయి. అందులో ఒక డబ్బింగ్ సినిమా కూడా ఉంది. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఈగల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. ఈ సినిమాను జనవరి 10 వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న హనుమాన్ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

నాగార్జున హీరోగా రూపొందుతున్న నా సామి రంగా సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఈ సినిమాను జనవరి 14 వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ , పరుశురామ్ కాంబోలో రూపొందుతున్న సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈ సినిమాను జనవరి 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

తమిళ నటుడు శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న తమిళ డబ్బింగ్ సినిమా అయాలాన్ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కనుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: