ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదల కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి రిలీజ్ డేట్ వాయిదా పడుతూ ఉండడంతో నిన్నటి రోజున ఈ సినిమా రిలీజ్ డేట్ పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దింతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. షారుక్ ఖాన్ నటిస్తున్న డుంకీ చిత్రం కూడా ఈ ఏడాది డిసెంబర్ 22న విడుదల కాబోతోంది.



అయితే ఇలా రెండు సినిమాలు ఒకేసారి విడుదల కాబోతూ ఉండడంతో అభిమానులకు మధ్య ఒక వార్ జరగబోతుందని సినీ ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల చేయడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందని ఒక బజ్ వినిపిస్తోంది. ముఖ్యంగా షారుక్ ఖాన్ ఈ సినిమాని ఏడాదిన్నర క్రితమే విడుదల తేదీని ప్రకటించారు అయితే ఇప్పుడు సలార్ సినిమా కూడా రిలీజ్ డేట్ ఒకే డేట్ ని ప్రకటించడంతో ఇది రెండో చిత్రాలకు కూడా ప్రమాదమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి సౌత్ వర్సెస్ నార్త్  వార్ కొనసాగే విధంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.




మరి ఇద్దరికీ 1000 కోట్లు మార్కెట్ ఉంది కనుక సరైన సక్సెస్ పడితే కచ్చితంగా ఈ సినిమాలో ఏదో ఒక సినిమా రికార్డులను సైతం మిగలకుండా కొట్టితే సత్తా ఉందని అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు. ఇలాంటి ఇద్దరు సూపర్ స్టార్ ఓకే రోజు పోటీ పడుతూ ఉండడంతో మరింత ఆసక్తి నెలకొంటోంది. అయితే ఏదో ఒక సినిమా కనీసం వారం రోజులైనా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: