డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చెక్కిన పెదకాపు 1 సినిమా ఆయన కెరీర్ లో మరో రాడ్డు సినిమా అయిపోయింది. వసూళ్లు విషయంలో ఈ సినిమా షెడ్డుకి పొయ్యి ట్రేడ్ కి పెద్ద షాక్ ఇచ్చాయి. రిలీజ్ కు ముందు భారీ అంచనాలు లేకపోయినా ట్రైలర్ చూసిన ఆడియన్స్  మొదటి రోజు ఖచ్చితంగా వస్తారని టీం భావించారు.కానీ ఈ సినిమాకి ఓపెనింగ్ గ్రాస్ కనీసం 30 లక్షలైనా రాకపోవడం షాక్ కి గురి చేసే విషయమే. పైగా పబ్లిక్ టాక్, రివ్యూలు కూడా అంతగా బాగా లేకపోవడం వల్ల వీకెండ్ మీద పెద్దగా నమ్మకం పెట్టుకోవడానికి లేకుండా పోయింది. రామ్ స్కందకు కూడా బ్యాడ్ టాక్ వచ్చినప్పటికి మాస్ కంటెంట్ తో పాటు రామ్ బ్రాండ్ వల్ల ఆడియన్స్ థియేటర్లకి వస్తున్నారు. అదే స్కందకు కాస్తో కూస్తో ప్లస్ పాయింట్ అయ్యింది.కానీ పెదకాపు 1 సినిమా విషయంలో మాత్రం చాలా దారుణమైన షాక్ తిన్నారు మేకర్స్. రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేసినా కూడా ఏమాత్రం లాభం లేకపోయింది.


ప్రివ్యూలు చూసిన వాళ్ళు చాలా బాగుందని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసినా కూడా అసలు దాని ప్రయోజనం టికెట్ కౌంటర్ల దగ్గర కనిపించలేదు. శ్రీకాంత్ అడ్డాల పూర్తిగా సీరియస్ జానర్ కి షిఫ్ట్ అయిపోవాలనే ఆలోచన ఒక రకంగా మంచిదే కానీ కొత్త హీరోతో ఇలాంటి ప్రయోగం చేసి మెప్పించాలనుకున్న ప్రయత్నం మాత్రం బెడిసి కొట్టింది. ఇక చాలా చోట్ల అయితే జనాలు రాలేదని షో లు క్యాన్సిల్ చేస్తున్నారు.సుమారు పన్నెండు కోట్ల దాకా బ్రేక్ టార్గెట్ పెట్టుకున్న పెదకాపు 1 కోటి కూడా వసూలు చేయలేని పరిస్థితి వచ్చింది. ఫైనల్ గా ఈ సినిమాకి భారీ నష్టాలు తప్పేలా లేవు.ఈ సినిమాని ఒక స్టార్ హీరో చేసుంటే కనీసం యావరేజ్ హిట్ అయినా అయ్యుండేది. ఒక కొత్త హీరోని పెట్టి ఇలాంటి సినిమా తీయడం వల్ల ఈ సినిమా పెద్ద భారీ డిజాస్టర్ గా మారడమే కాకుండా శ్రీకాంత్ అడ్డాలాకి మరో మాయని మచ్చగా మిగిలిపోయింది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: