పెద్దపెద్ద షోరూమ్స్ తమ సేల్స్ పెంచుకోవడానికి ఏదో ఒక ఆఫర్ ప్రకటిస్తేకాని జనం షోరూమ్స్ రావడంలేదు. ఇక రాజకీయ పార్టీలు అయితే తాము అధికారంలోకి రావడానికి అనేక ఉచిత పదకాలు ప్రకటిస్తే కాని జనం ఓట్లు వేయడంలేదు. ఇప్పుడు ఈ ట్రెండ్ సినిమాలలో కూడ ప్రవేశపెట్టి బాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.కొన్ని వారాల క్రితం విడుదలైన షారూఖ్ ఖాన్ ‘జవాన్’ దేశవ్యాప్తంగా బ్లాక్ బష్టర్ హిట్ కావడంతో ఆమూవీ 1000 కోట్లు కలక్షన్స్ ను రాబట్టి రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈసినిమా కలక్షన్స్ పూర్తిగా తగ్గిపోవడంతో ఈమూవీ బయ్యర్లు ఒక కొత్త పదకాన్ని ఆలోచించారు. ‘జవాన్’ మూవీ చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు ఒక టిక్కెట్ కొన్నవారికి మరొక టిక్కెట్ ఉచితంగా ఇచ్చి వన్ ప్లస్ వన్ ఆఫర్ కు శ్రీకారం చుట్టారు.ఈపదకం సక్సస్ అవ్వడంతో ‘జవాన్’ కలక్షన్స్ మళ్ళీ పుంజుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత సంవత్సరం విడుదలైన రణబీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’ మూవీ కలక్షన్స్ తగ్గిపోయినప్పుడు ఇలాంటి వన్ ప్లస్ వన్ ఆఫర్ ను ప్రకటించి ఆమూవీ కలక్షన్స్ పడిపోకుండా కొంతవరకు రక్షించారు. ఇప్పుడు ఇలాంటి ఉచితాలు తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సినిమాలకు సంబంధించి అమలు చేస్తే కొంతవరకు బయ్యర్లు సేఫ్ లో ఉంటారు కదా అన్న చర్చలు జరుగుతున్నాయి.  ప్రస్తుతం సినిమా టాక్ బాగున్నప్పటికీ కొన్ని వారాలు వేచి చూస్తే ఆమూవీ ఒటీటీ లో చూడవచ్చుకడా అన్న అభిప్రాయంలో చాలామంది ప్రేక్షకులు ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వన్ ప్లస్ వన్ ఆఫర్లు మన టాప్ హీరోల సినిమాలకు కూడ ఉంటాయి అని తెలిస్తే కొంతమంది ప్రేక్షకులు టాప్ హీరోల సినిమాలను వన్ ప్లస్ వన్ ఆఫర్ లో వచ్చినప్పుడు చూడవచ్చు కదా అనే ప్రమాదం కూడ ఉంది అంటూ మరికొందరు హెచ్చరికలు చేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: