బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఎవరు ఊహించని విధంగా ఆరో వారంలో ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది. అయితే హౌస్ లోకి వెళ్ళిన తర్వాత యాక్టివ్గా ఉంటూ అన్ని గేమ్స్ లో కొత్తగా వచ్చిన మిగతా కంటెస్టెంట్స్ కంటే చురుగ్గానే ఉంది. కానీ ఆమె ఎందుకు ఎలిమినేట్ అయింది అన్నది మాత్రం ఎవరికి అర్థం కాని విషయం. అయితే నయని పావని ఎలిమినేషన్ గురించి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
నయని పావని ఎలిమినేట్ చేయడం వల్ల బిగ్బాస్ షో విలువను కోల్పోయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఎలిమినేషన్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని.. నయని ఎలిమినేషన్ తనను ఎంతగానో బాధించిందిఅంటూ చెప్పుకొచ్చాడు. ఎంతో యాక్టివ్ గా ఉండే ఆమెకు ఇలా జరగడం కరెక్ట్ కాదు.. ప్రేక్షకులు వేసే ఓటింగ్లను కంటెస్టెంట్లు ఎలిమినేషన్కు ఎలాంటి సంబంధం లేదు అంటూ షాకింగ్ విషయం చెప్పాడు. ఈ విషయాన్ని జనాలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలంటూ కోరాడు. బిగ్బాస్ అన్ని సీజన్స్ కు సంబంధించిన ఓటింగ్ ఎలిమినేషన్ వివరాలు ఇవ్వాలని ఎవరైనా కోర్టులో పిలు దాఖలు చేయాలంటూ అర్జున్ పేర్కొన్నాడు. కాగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కాస్త సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి