మలయాళ స్టార్ మమ్ముట్టి, జ్యోతిక జంటగా నటించిన తాజా చిత్రం కాథల్ ది కోర్. రీసెంట్ గా 'కన్నూర్ స్క్వాడ్' మూవీ తో మంచి సక్సెస్ అందుకున్న మమ్ముట్టి మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జో బేబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమ్ముట్టి సరసన జ్యోతిక నటించింది. నవంబర్ 23న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన సెలబ్రిటీలు సైతం ఇది చాలా గొప్ప సినిమా అంటూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు.

 తాజాగా ఈ సినిమాని వీక్షించిన కోలీవుడ్ అగ్ర హీరో సూర్య సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. అందమైన ఆలోచనలు కలిసి వస్తే మనకు కాథల్ ది కోర్ లాంటి సినిమాలు పుట్టుకొస్తాయని ఈ సందర్భంగా తెలిపారు సూర్య. " మంచి సినిమా పట్ల మమ్ముట్టి సార్ చూపించే ప్రేమ, గౌరవం, ఆయన ఇచ్చే స్ఫూర్తి ఎంతో అద్భుతం. ఇంత చక్కటి మెసేజ్ తో నిండి ఉన్న ఈ అందమైన సినిమాను అందించిన మమ్ముట్టి సార్ టీంకు నా హాట్సాఫ్. సినిమాలో నిశ్శబ్ద సన్నివేశాలు కూడా విలువల గురించి మాట్లాడతాయి. మాకు ఈ ప్రపంచాన్ని చూపించిన రైటర్స్ ఆదర్శ్ సుకుమారన్ అండ్ పౌల్సన్ స్కెరియాకు బెస్ట్ విషెస్" అని తెలిపారు. 

ఇక చివర్లో 'నా ప్రియమైన జ్యోతిక తన ప్రేమతో అందరి హృదయాలని మరోసారి గెలుచుకుంది' అంటూ సూర్య తన ఇన్ స్టాగ్రామ్ లో రాసుకోచ్చారు. కాగా హీరో సూర్య చేసిన ఈ పోస్ట్ పై మమ్ముట్టి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.." సినిమా పట్ల మీరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్ కి థాంక్యూ సూర్య సార్" అంటూ ట్వీట్ చేశారు. దీంతో కాథల్ ది కోర్ మూవీపై సూర్య చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. సూర్యతోపాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ ఇయర్ లో చూసిన బెస్ట్ సినిమా ఇదే అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: