తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా మంచు గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఎస్కేఎన్ ఒకరు. ఇకపోతే ఈయన చాలా సంవత్సరాలుగా సినిమాలను నిర్మిస్తూ వస్తున్నప్పటికీ బేబీ మూవీ తో ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఈ సంవత్సరం విడుదల అయినటువంటి బేబీ మూవీ కి ఈయన నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించగా సాయి రాజేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఇకపోతే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ విడుదలకు ముందు నుండే ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుము విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన టాక్ ను విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే తెచ్చుకుంది. ఇలా మొదటి షో కే ఈ మూవీ కి సూపర్ టాక్ రావడంతో ఈ సినిమా నిర్మాత ఫుల్ జోష్ లో  కాల్ట్ బొమ్మ ఇచ్చాం అంటూ ఓ పదాన్ని వాడాడు. దీని ద్వారా ఈయన సోషల్ మీడియాలో చాలా రోజులు వైరల్ అయ్యాడు.

ఇకపోతే ఇలా ఈ పదంతో వైరల్ అయిన ఈయన ఈ టైటిల్ తో ఓ సినిమా చేయాలి అని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ప్రొడ్యూసర్ ఎస్కేయన్ కల్టు బొమ్మ అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఏదైనా కథ ఈ టైటిల్ కుదిరినట్లు అయితే ఈ టైటిల్ తో ఓ సినిమా చేయాలి అని నిర్మాత ఎస్కేయన్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ నిర్మాత సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

skn