ఈమూవీ విడుదల అయిన తరువాత జరిగిన మీడియా సమావేశాలలోనూ ఆఖరికి ఈమూవీ యూనిట్ కు సంక్రాంతి పండుగ సందర్భంగా మహేష్ ఏర్పాటు చేసిన లంచ్ కి త్రివిక్రమ్ కనిపించక పోవడంతో త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ షాక్ నుండి ఇప్పటికీ తెరుకోలేకపోతున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనికితోడు ఈమధ్య త్రివిక్రమ్ తన ఇంటికే పరిమితం అయి తాను తీయబోయే సినిమాల కథల గురించి ఆలోచిస్తున్నాడు అంటూ మరి కొందరు అంటున్నారు.
ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి నాని వెంకటేష్ రామ్ లాంటి హీరోలు రెడీగా ఉన్నప్పటికీ త్రివిక్రమ్ తన మనసులో మాట బయట పెట్టడం లేదు అని అంటున్నారు. రామ్ పెదనాన్న ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ ఎప్పటి నుంచో రామ్ తో ఒక సినిమాను చేయమని త్రివిక్రమ్ పై ఒత్తిడి చేస్తున్నప్పటికీ త్రివిక్రమ్ ఆ విషయం పై పూర్తిగా శ్రద్ద పెట్టడం లేదు అని అంటారు.
నాని తో సినిమా చేసే విషయంలో కూడ త్రివిక్రమ్ ఎటువంటి క్లారిటీలో లేడు అంటారు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఆలోచనలలో అల్లు అర్జున్ జూనియర్ ప్రభాస్ లు ఉన్నారు అని అంటారు. ‘పుష్ప 2’ తరువాత బన్నీ చేయబోయే సినిమా పై క్లారిటీ లేకపోవడంతో బన్నీ తో మళ్ళీ జత కట్టడానికి త్రివిక్రమ్ అతడికి నచ్చే కథ గురించి ఆలోచిస్తున్నాడు అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి