మోస్ట్ టాలెంటెడ్ నటిమని కంగనా రణౌత్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ అద్భుతమైన రీతి లో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది . ఇక పోతే ఈ నటి సినిమాల ద్వారా ఏ స్థాయిలో వార్తల్లో నిలుస్తూ ఉంటుందో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా కూడా అదే స్థాయిలో వార్తలు నిలుస్తూ ఉంటుంది. సమాజంలో ఏదైనా సంఘటన జరిగింది అంటే కంగనా తనదైన రీతిలో వాటిపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇకపోతే తాజాగా కంగనా పొలిటికల్ ఎంట్రీ పై స్పందించింది.

తాజాగా కంగనా పొలిటికల్ ఎంట్రీ పై స్పందిస్తూ ... ఒక వేళ నేను కనుక రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే ఇదే సరైన సమయం అని చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు నేను దేశం కోసం ఎంతో సేవ చేశాను. ప్రజా సమస్యలపై సినిమా సెట్ నుండే పోరాడి జాతీయ వాదిగా నేను గుర్తింపును తెచ్చుకున్నాను. సినిమాల ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ప్రజలు కూడా నాపై ఎంతో ప్రేమాభిమానాలను చూపిస్తున్నారు. దేశం నాకు చాలా ఇచ్చింది.

అందుకే దేశానికి కూడా నేను ఎంతో తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది అని తాజా ఇంటర్వ్యూ లో కంగనా పొలిటికల్ ఎంట్రీ పై కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇకపోతే కంగనా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కూడా ఈ నటి చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇలా అనేక సినిమాలలో నటిస్తూనే ఈ ముద్దు గుమ్మ రాజకీయాలపై దృష్టి ని పెట్టింది. ఇక తాజాగా కంగనా పొలిటికల్ ఎంట్రీ పై చేసిన వ్యాఖ్యలను చూస్తూ ఉంటే చాలా తక్కువ కాలం లోనే ఈ నటి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: