ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో కూడా ప్రేక్షకులను అందిస్తూ వస్తున్నారు ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్. ఇటీవల కాలంలో ఫైటర్, యానిమల్ లాంటి సినిమాల్లో కీలకపాత్రలో నటించిన ఆయన.. మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ కపూర్ సౌత్ ఇండస్ట్రీ కారణంగానే తాను ఈ స్థాయిలో ఉన్నాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల కాలంలో తనను మంచి పాత్రల కోసం సినిమాల్లో ఎంపిక చేసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీ గురించి అనిల్ కపూర్ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి.


 అన్ని భాషల ప్రేక్షకులు కూడా నన్ను ఆదరిస్తారు. ఈ విషయంలో నేను ఎప్పుడూ అదృష్టవంతుడిగా భావిస్తూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. మరి ముఖ్యంగా యూత్ ఆలోచనలు ఎప్పుడు సరికొత్తగా ఉంటాయి. అందుకే కాస్త సమయం దొరికిన కూడా వారితో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఇక నేను హీరోగా ఈ స్థాయిలో ఉన్నాను అంటే దక్షిణాది సినిమాలే కారణం అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ కపూర్. బాలీవుడ్ లో నేను ఇప్పటివరకు చేసిన సినిమాలు ఎక్కువగా సౌత్ సినిమాలే. కేవలం నేను మాత్రమే కాదు దేశంలో ఉండే గొప్ప నటుల్లో ఎక్కువమంది దక్షిణాది చిత్రాలనే రీమేక్ చేసిన వారే ఉన్నారుఅంటూ అనిల్ కపూర్ చెప్పుకొచ్చారు.


 సౌత్ ఇండస్ట్రీలో గొప్ప యాక్టర్స్ ఉన్నారు. మంచి మంచి కథలతో సినిమాలు తీస్తున్నారు. ఇక ఈ క్రమంలో వచ్చినవే బాహుబలి, పుష్ప, కేజిఎఫ్ లాంటి చిత్రాలు ఈ సినిమాలను టాలీవుడ్, బాలీవుడ్ అంటూ విడదీయకండి అన్నింటినీ భారతీయ చిత్రాలుగానే చూడండి అంటూ అనిల్ కపూర్ చెప్పుకొచ్చాడు. కాగా 1980లో వంశవృక్షం అనే సినిమా తార టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యాడు. అనిల్ కపూర్ బాబు దర్శకత్వంలో ఈ సినిమా దొరికింది. ఇక బాబు కారణంగానే తాను చిత్ర పరిశ్రమలో ఈ స్థానంలో ఉన్నానని ఎప్పుడూ అనిల్ కపూర్ చెబుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: